ప్రధాన పేజి > వినోదం > హాస్యం > చెవాకులు > మేముండగా మీరెలా విమర్శిస్తారు ?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మేముండగా మీరెలా విమర్శిస్తారు ?
వార్త : తెలంగాణకు మద్దతు తెలిపిన తెలుగుదేశాన్ని విమర్శిస్తే ఊరుకోం... టీఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖరరావు.

చెవాకు : చంద్రశేఖరన్నా... తెలుగుదేశాన్ని విమర్శిస్తే ఊరుకోం అంటూ మీరు ఎందుకు అంటున్నారో మాకు తెలిసిందిలే. మీరూ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలే కదా... ఆ పార్టీలోంచి విడిపోయేగా మీరు టీఆర్ఎస్ స్థాపించారు. అలాంటి మీ మాతృ పార్టీని విమర్శించాలన్నా... పొగడాలన్నా మీకే హక్కు ఉంటుంది గానీ మరొకరికి ఆ హక్కు ఎక్కడుంటుంది...

అందుకే కదూ మిగతావారు తెలుగుదేశాన్ని విమర్శిస్తే ఊరుకోం... అంటూ మీరు మండిపడుతున్నారు. అందులోనూ ఇప్పుడా పార్టీ తెలంగాణకు జై అంటోంది కూడా... రాష్ట్రంలో పొత్తుకు పార్టీలు కరువైన మీకు ఎలాగూ తెలుగుదేశంతో దోస్తీ కట్టక తప్పదు. అందుకే కదూ... తెలుగుదేశంపై మీరు ఇంతలా ప్రేమ కురిపిస్తున్నారు... అన్నా చంద్రశేఖరన్నా మీ ఎత్తులు మాకు అర్ధమైందిలే...
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఆ గొప్పతనం ఎవరికి దక్కేనో... ?
బాగా ఆలస్యం చేశారు కదండీ... ?
అసలే రోజులు బాగోలేదు... ?
మాకిక సినిమాలు కూడా కరువేనా... ?
అధికారంకోసం అభివృద్ధికి బ్రేకులా?
మరి అవసరాలు అలాంటివి