ప్రధాన పేజి > వినోదం > హాస్యం > చెవాకులు > అబ్బా... ఎప్పుడూ అదే మాటేనా... ?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అబ్బా... ఎప్పుడూ అదే మాటేనా... ?
FileFILE
వార్త : ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే ఈ విషయంలో ఎలాంటి ఇతర సమస్యలు రాకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం, అవి పూర్తికాగానే తెలంగాణ ఏర్పాటుపై ముందడుగు వేస్తాం... ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డి.

చెవాకు : అయ్యా వైఎస్ గారూ... మీ ఏ విషయమైనా అద్భుతంగా చెబుతారండి. ఓపక్క తెలంగాణకు అభ్యంతరం లేదంటారు. మరోపక్క ఇప్పట్లో తెలంగాణ రాదంటారు. కాదంటే తెలంగాణ సమస్యపై సమగ్ర అధ్యయనం కోసం కమిటీ వేశాం కదా అంటూ సన్నాయి నొక్కులు నొక్కేస్తారు.

అసలింతకీ తెలంగాణ ఇవ్వాలని మీ పార్టీ అంత గట్టిగా అనుకుని ఉంటే ఆ వేసే కమిటీ ఏదో గత ఐదేళ్ల ముందే వేయొచ్చు కదా ? అయినా మరో ఐదేళ్లు అధికారంలో ఉండేందుకు ప్రజా మద్దతు సాధించిన మీరు ఇప్పట్లో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారని భావించడం బహుశా అత్యాశే అవుతుందేమో ?
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
అబ్బో... ఆ విషయం మాకూ తెలుసులేండి
ఫర్వాలేదు... ఇప్పుడైనా స్పందించారు
ఆబ్బో ఆపని మీకు బాగా తెలిసినట్టుందే...?
మెరుపుకలలు కంటున్నారు కాబోలు... ?
అబ్బ... ఏం చెప్పారండీ మీరు...?
వాగ్దానాలపుడు మీకు కన్పించేవి అవేగా...?