జోకులు | కార్టూన్లు | చెవాకులు
ప్రధాన పేజి » వినోదం » హాస్యం » చెవాకులు » రోజా "ఐరన్ లెగ్" అట..! ఎంత మాటన్నావ్ శోభా..! (Humour| Satire| Roja| Iron Leg| Shobha Rani| Cinema| PRP| TDP| Congress| YSR| Chandra Babu)
 
Roja
FILE
సినీరంగంలో ఒకప్పుడు అగ్రహీరోయిన్‌గా ముద్రవేసుకున్న రోజా ప్రస్తుతం నానా మాటలు పడాల్సి వస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

రాజకీయాల్లో అడుగుపెట్టి తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలైన రోజాను చూస్తే చాలా జాలేస్తోందని మహిళా రాజ్యం అధ్యక్షురాలు శోభారాణి అంటున్నారు.

ఎన్నికల ప్రచారం సమయంలో సినీ హీరోయిన్లపై తీవ్రంగా పరుష పదజాలంతో విమర్శలు గుప్పించిన రోజాతో వాగ్వివాదానికి దిగిన శోభారాణి మళ్లీ రోజాను తన మాటల తూటాలతో పేల్చుతున్నారు.
Shoba Rani
FILE


"రోజా ఎక్కడ ఉంటే అక్కడ భారీ నష్టం జరుగుతోంది.. అప్పుడు చంద్రబాబును అలిపిరి వెళ్ళేముందు కలిసింది. ఇప్పుడు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరుతానని చెప్పింది.

అది జరక్కముందే అనర్థం జరిగిపోయిందని శోభారాణి సోమవారం మీడియా సమక్షంలో దుమ్మెత్తి పోశారు. మొత్తానికి రోజా "ఐరన్‌ లెగ్" అని శోభారాణి చెప్పకుండా చెప్పారని విశ్లేషకులు చెవులు కొరుక్కుంటున్నారు.

ఇంకా శోభారాణి మాట్లాడుతూ.. ఇది మాట్లాడే సందర్భం కాకపోయినప్పటికీ మాట్లాడాల్సిన అవసరం వచ్చిందని, ఈ నేపథ్యంలో రోజా పీఆర్పీ పార్టీ వైపు రాకూడదని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

మొత్తానికి రోజా పయనమెటో? తెలియదు గానీ.. "ఐరన్‌ లెగ్" అని తనపై వచ్చిన వ్యాఖ్యలకు రోజా ఏవిధంగా స్పందిస్తారో..? వేచి చూడాల్సిందే..!.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.