విక్టరీ వెంకటేష్ అంటే... తెలియని వారంటూ ఉండరూ... తాజాగా నంది అవార్డును సొంతం చేసుకున్న వెంకీ.. ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు కుమారుడన్న విషయం అందరికీ తెలిసిందే. డిసెంబర్ 13, 1960వ సంవత్సరంలో ప్రకాశం జిల్లా కారంచేడులో జన్మించిన వెంకటేష్... అమెరికాలోని మాంటెర్రీ విశ్వవిద్యాలయంలో ఎం.బి.ఏ చదివాడు. వెంకటేష్ సతీమణి పేరు.. నీరజ.
వెంకటేష్-నీరజ దంపతులకు ఆశ్రిత, హయవాహిని మరియు భావన అనే ముగ్గురు కుమార్తెలతో పాటు అర్జున్ రాంనాథ్ అనే కుమారుడున్నాడు. చంటి, కలిసుందాం రా, సుందరకాండ, రాజా, బొబ్బిలిరాజా, ప్రేమించుకుందాం రా, పవిత్రబంధం, సూర్యవంశం, లక్ష్మి, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వంటి హిట్ చిత్రాలతో వెండితెరలో తన హవాను కొనసాగిస్తోన్నాడు. తాజాగా వెంకీ చింతకాయల రవిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
"ఆడవారి మాటలకు అర్థాలే వేరులే" చిత్రం 2007వ సంవత్సరానికి గానూ నంది అవార్డును సంపాదించి పెట్టింది. సంక్రాంతి రోజున నంది అవార్డును అందుకున్న విక్టరీ వెంకటేష్ చిరునామా మీ కోసం...
డి. వెంకటేష్, ఫ్లాట్ నెం.. ఎ-3, ఫిల్మ్ నగర్, జూబ్లీహిల్స్, హైదరాబాద్-33.