గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » అడ్రస్ డైరీ » బెస్ట్ కిస్సర్ ఫ్రిడా పింటో పర్సనల్ టచ్ (Freida Pinto| Slumdog Millionaire| Mumbai| BAFTA)
అడ్రస్ డైరీ
Feedback Print Bookmark and Share
 
IFM
మోడల్‌గా, యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ముంబై భామ ఫ్రిడా పింటో. అంతర్జాతీయ షోలలో యాంకర్‌గా చేసిన పింటో, మోడల్ రంగంలోనూ రాణించింది. అంతేగాకుండా ఎయిర్‌టెల్, హచ్ వంటి పలు వాణిజ్య ప్రకటనల్లో నటించిన ఫ్రిడా పింటోకు 8 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రం ద్వారా అదృష్టం తలుపు తట్టింది.

2008 సంవత్సరంలో రూపుదిద్దుకున్న డాని బోయెల్ "స్లమ్‌డాగ్ మిలియనీర్" చిత్రంలో ఫ్రిడా కథానాయిక పాత్రను పోషించడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించింది. ఈ సినిమా కోసం ఉత్తమ నటీమణిగా బాప్టా అవార్డును సొంతం చేసుకున్న ఫ్రిడా పింటోకు ప్రస్తుతం హాలీవుడ్ ఆఫర్లు వెల్లువల్లా వస్తున్నాయి.

ఫ్రిడా పింటో సిల్వియా పింటో-ఫ్రెడరిక్ పింటో దంపతులకు ముంబైలో పుట్టిన ఫ్రిడా పింటోకు ఓ సోదరి ఉంది. సెయింట్. ఎక్సావియర్ కాలేజ్‌లో డిగ్రీ పూర్తి చేసిన పింటో తండ్రి గోర్గాన్‌లోని జాన్ హైస్కూల్‌కు ప్రిన్సిపల్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, తల్లి ఫ్రెడరిక్ పింటో బ్యాంక్ ఆఫ్ బరోడాలో సీనియర్ బ్రాంచ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు.

పుట్టిన తేదీ.. 18 అక్టోబర్ 1984,
పుట్టిన స్థలం.. ముంబై,
తొలి చిత్రం.. స్లమ్‌డాగ్ మిలియనీర్.
గెలిచిన అవార్డులు: స్క్రీన్ యాక్టర్ గైడ్ అవార్డు (స్లమ్‌డాగ్),

పొందిన నామినేషన్లు:
2008: బ్లాక్ రీ అవార్డ్స్- 2008లో ఉత్తమ సహగాయిని (స్లమ్‌డాగ్ మిలియనీర్)
2009: 62వ బాఫ్టా అవార్డ్స్- సహాయ పాత్రలో ఉత్తమ నటి అవార్డు (స్లమ్‌డాగ్ మిలియనీర్)
2009: ఎంటీవీ మూవీ అవార్డ్స్- ఉత్తమ మహిళా నటి (స్లమ్‌డాగ్ మిలియనీర్)
2009: ఎంటీవీ మూవీ అవార్డ్స్- బెస్ట్ కిస్ (స్లమ్‌డాగ్ మిలియనీర్)
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ఫ్రిడా పింటో, స్లమ్డాగ్ మిలియనీర్, మోడల్, యాంకర్, బాప్టా, హాలీవుడ్, ముంబై, డానీ బోయెల్