గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » అడ్రస్ డైరీ » హ్యాపీ బర్త్‌ డే గోపిచంద్.. (Gopichand, Happy Birth day, Trisha, Sankham, Jayam)
అడ్రస్ డైరీ
Feedback Print Bookmark and Share
 
FILE
"తొలివలపు" చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచమైన మాస్ హీరో గోపిచంద్. ఈ సినిమా ఆయనకు అంతగా గుర్తింపు సంపాదించి పెట్టలేదు.

అయితే నిజం (2003), వర్షం (2004), జయం (2003) వంటి సినిమాల్లో నెగటివ్ రోల్ పోషించిన గోపిచంద్‌కు మంచి క్రేజ్ లభించింది. త్రికోణ ప్రేమకథా నేపథ్యంలో విడుదలైన బ్లాక్‌బస్టర్ మూవీ జయంలో గోపిచంద్ అద్భుతమైన నటనతో టాలీవుడ్‌లో నిలదొక్కుకున్నాడు.

ఇదే క్రేజ్‌తో విలన్ పాత్రల నుంచి హీరో స్థాయికి ఎదిగిన గోపిచంద్‌ సినీ కెరీర్‌ను యజ్ఞం చిత్రం మలుపు తిప్పింది. ఆ తర్వాత నెగటివ్ రోల్స్‌కు మెల్లమెల్లగా స్వస్తి చెప్పి యజ్ఞం (2004), రణం (2006) వంటి చిత్రాల్లో హీరో స్థాయికి ఎదిగాడు.

తదనంతరం ఒక్కమగాడు (2007), లక్ష్యం (2007), శౌర్యం (2008) వంటి చిత్రాలు గోపిచంద్‌కు మంచి గుర్తింపు సాధించిపెట్టాయి. డైరక్టర్ టి. కృష్ణ కుమారుడైన గోపిచంద్, రష్యాలో ఇంజనీరింగ్ కోర్సును పూర్తి చేశాడు.

త్వరలో వర్షం సినిమాలో హీరోయిన్ పాత్రను పోషించిన త్రిషతో "శంఖం" చిత్రం ద్వారా గోపిచంద్ హీరోగా మారి రొమాన్స్ చేయనున్నాడు. ఇంకేముంది..? గోపిచంద్ పుట్టిన రోజు సందర్భంగా.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న"శంఖం" చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందాలని మనమూ ఆశిద్దాం.

పుట్టిన తేదీ.. 12, జూన్, 1982,
జన్మస్థలం.. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్.
నటించిన చిత్రాలు.. 15కి పైగా.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: గోపిచంద్, తొలివలపు, జయం, వర్షం, రణం, లక్ష్యం, యజ్ఞం, శౌర్యం, పుట్టినరోజు