గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » అడ్రస్ డైరీ » "బోణి" కథానాయిక కృతి పర్సనల్ టచ్ (Boni, Kruthi, Sumanth, Ramana Gogula, Punjabi)
అడ్రస్ డైరీ
Feedback Print Bookmark and Share
 
WD
తొలి సినిమా "బోణి"లో అచ్చ తెలుగమ్మాయిలా కనిపించి కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన అందాల ముద్దుగుమ్మ కృతికరబంద. ఢిల్లీలో పుట్టి బెంగళూరులో పెరిగిన కృతి జ్యూయెల్లరీలో డిప్లొమా చేసి, కెనరాబ్యాంక్, లైఫ్‌స్టైల్ తదితర సంస్థలకు మోడలింగ్ చేసింది. ఉత్తరాదిలో పుట్టినా తెలుగు తెరకు పరిచయమైన కృతి.. మోడలింగే తనకు హీరోయిన్‌ హోదాను సంపాదించి పెట్టిందని చెబుతోంది.

సుమంత్‌ సరసన 'బోణి'లో నటించిన కృతికి ఆమె తల్లిదండ్రులే రోల్ మోడల్ అని అంటోంది. బోణి చిత్రాన్ని రెండు, మూడు సార్లు థియేటర్లలో చూశాననీ, మాస్‌నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పింది.

ఒకసారి తన కోర్డినేటర్‌ ద్వారా రమణగోగుల నుంచి పిలుపువస్తే వెళ్ళానని, అప్పుడు ఆయన బోణి సినిమా గురించి చెప్పారు. దాదాపు యాభైమందిని సెలక్ట్ చేయాలని పిలిపించారు. అందులో తనకు అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. బోణి చిత్రం షూటింగ్‌లో ఉండగానే ఐదు చిత్రాల్లో ఆఫర్లు వచ్చాయి. ఇంకా ఫైనల్‌ చేయలేదని కృతి చెప్పుకొచ్చింది.

ఇంకా కృతి తన గురించి చెబుతూ.. తాను మధ్యతరగతి కుటుంబానికి చెందిన దానినని, తండ్రి ఆటోమొబైల్‌రంగంలో ఉన్నారని, అమ్మ తన కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేస్తుంది. అయితే అవి ఇంటివరకేనని కృతి తెలియజేసింది. నటిగా తల్లిదండ్రుల సపోర్ట్‌ తనకు చాలా ఉందని, ప్రతి విషయాన్ని వారితో చర్చించాకే సరైన నిర్ణయం తీసుకుంటానని ఆమె చెబుతోంది.

తల్లిదండ్రుల నీడలో క్రమశిక్షణతో పెరిగానని, తనకు రోల్‌మోడల్స్‌ వారేనని, నటిగా ఏ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్ళలేదని కృతి తెలిపింది. పుట్టుకతోనే ఎవరూ నటులు కాలేరని, అమితాబ్‌, నాగేశ్వరరావు... ఇలా ఎవరిని తీసుకున్నా కష్టపడి ఈ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకున్న వాళ్లేనని కృతి కరబంద ఎత్తి చూపింది.

తనకు తెలుగు ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టమని, బోణి యూనిట్‌‌లో అంతా కలిసిమెలిసి పనిచేసేవాళ్ళమని కృతి తెలిపింది. షూటింగ్ సమయంలో సుమంత్‌, రమణగోగుల, ఆయన భార్య అంతా కలిసి భోంచేసేవాళ్ళం. ఇగోలంటూలేవు. పండుగవస్తే దీపావళి ఇంటిదగ్గర ఎలా చేసుకుంటామో? అంతలా ఇక్కడ కలిసి చేసుకునేవాళ్లమని కృతి వెల్లడించింది. తెలుగులో ఎలా మాట్లాడాలో.. కొంచెం కొంచెం నేర్చుకున్నానని, కానీ పూర్తిగా ఇంకా మాట్లాడటం రాదని కృతి తెలిపింది.

మరోవైపు బాలీవుడ్‌లో చేయగలిగే పాత్రలు వస్తే తప్పకుండా నటిస్తాను. తెలుగులో గోదావరి, మధుమాసం, పోకిరి పలు చిత్రాలు చూశాను. మంచి కథాంశాలతోపాటు టేకింగ్‌ చాలా బాగున్నాయని చెప్పింది. ఇక అందం విషయానికొస్తే.. హాయిగా నిద్రపోవడం.. తల్లిదండ్రులు చెప్పినట్లు వినడంలోనే అందముందని కృతి కరబంద వెల్లడించింది.

స్వీట్‌మొమెరిసీస్: తెలుగు పరిశ్రమలో పనిచేయడమే,
అసలు పేరు: కృతి అనేది నా పేరు. కరబంద అనేది పంజాబీలో సర్‌నేమ్‌గా వచ్చేది,
మాతృభాష: పంజాబీ,
హ్యాబీస్: మోడలింగ్‌,
నచ్చిన డ్యాన్స్: రాజస్థానీ ఫోక్,
డ్రీమ్‌ రోల్స్‌: పెద్దగా లేవు,
చేయాలనుకునే రోల్: లేడి ఓరియెంటెడ్ రోల్.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: బోణి, కృతి, సుమంత్, రమణ గోగుల, పంజాబీ, మోడలింగ్, రాజస్థానీ ఫోక్