గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » అడ్రస్ డైరీ » "మిత్రుడు" హీరోయిన్ 'ప్రియమణి' పర్సనల్ టచ్ (Priyamani| Personal Touch| Pellaina Kotthalo| Yamadonga| Drona)
అడ్రస్ డైరీ
Feedback Print Bookmark and Share
 
WD
"ఎవరే అతగాడు" చిత్రం ద్వారా టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకొచ్చిన సెక్సీతార ప్రియమణి. నవవసంతం, యమదొంగ, మిత్రుడు వంటి చిత్రాల ద్వారా వెండితెర కథానాయికగా నిలదొక్కుకున్న ప్రియమణికి కోలీవుడ్ "పరుత్తివీరన్" సినిమా జాతీయ అవార్డును సంపాదించి పెట్టింది.

"పరుత్తివీరన్"లో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ భామ కేరళలోని పాలక్కాడులో జన్మించింది.

కోలీవుడ్‌ సినీ పరిశ్రమకు ప్రముఖ దర్శకుడు "భారతి రాజా" ద్వారా పరిచయమైన ప్రియమణికి తమిళ సినిమాలు మంచి పేరును తెచ్చిపెట్టాయి. కాంచీపురం సిల్క్స్‌కు మోడలింగ్ చేస్తూ హీరోయిన్‌గా ఎదిగిన ప్రియమణికి, కోలీవుడ్‌ చిత్ర పరిశ్రమ ద్వారా మంచి గుర్తింపు లభించింది.

కోలీవుడ్ మాత్రమే గాకుండా.. తెలుగు, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటిస్తోన్న ఈ భామ బాలీవుడ్ సినీతార విద్యాబాలన్ రెండో సోదరి (దూరపు బంధువు). భయ్యా, ద్రోణ వంటి సినిమాల్లో టాలీవుడ్ సెక్సీతారగా అందాలను ఆరబోసిన ప్రియమణి, తాజాగా జగపతిబాబుతో మళ్లీ జతకట్టింది. జగపతిబాబు హీరోగా నటించే "ప్రవరాఖ్యుడు" సినిమాలో ప్రియమణి నటిస్తోంది.

పుట్టినరోజు: జూన్ 4, 1983,

పూర్తిపేరు: ప్రియమణి,

ముద్దుపేరు: మణి,

విద్య: బి.కామ్,

తొలి తెలుగు చిత్రం: ఎవరే అతగాడు,

హిట్ చిత్రాలు: యమదొంగ, పెళ్లైన కొత్తలో, నవవసంతం,

అలవాట్లు: టీవీ చూడటం,

టైమ్ పాస్: స్నేహితులతో చాటింగ్ చేయడం,

నచ్చిన హీరోలు: అందరూ..!,

నచ్చిన హీరోయిన్: శ్రీదేవి,

నచ్చిన వంటకం: శాకాహారం ఏదైనా.. విత్ డైట్,

నచ్చిన పానీయం: నీళ్లే..!,

నచ్చిన దుస్తులు: జీన్స్ అండ్ టీ షర్ట్,

పాజిటివ్ పాయింట్: ఫ్రెండ్లీనెస్,

గోల్: ఉత్తమ నటీమణి కావడం,

జీవితం గురించి: అత్యంత విలువైంది,

ప్రేమ గురించి..: ఒకరినొకరు అర్థం చేసుకోవడం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ప్రియమణి, పర్సనల్ టచ్, పెళ్లైన కొత్తలో, యమదొంగ, భయ్యా, ద్రోణ, ప్రవరాఖ్యుడు