గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » అడ్రస్ డైరీ » "పదహారేళ్ల వయసు" కథానాయిక 'శ్రీదేవి' పర్సనల్ టచ్ (SriDevi| N.T. Rama Rao| Akkineni Nageswara Rao| Superstar Krishna| Chiranjeevi| Kamal Hasan| Tamil| Hindi| Malayalam)
అడ్రస్ డైరీ
Feedback Print Bookmark and Share
 
Sri Devi
FILE
తమిళనాడు రాష్ట్రంలోని శివకాశిలో జన్మించి బాలనటిగా తన నటనా జీవితాన్ని ప్రారంభించి అగ్రహీరోయిన్ స్థాయికి ఎదిగిన అందాల తార శ్రీదేవి. దక్షిణ, ఉత్తరాది భాషల్లో కథానాయికగా ఓ వెలుగు వెలిగిన శ్రీదేవి బంగారక్క (1977) అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది.

తమిళం, మలయాళం సినిమాల్లో ఎక్కువ సినిమాల్లో నటించిన శ్రీదేవి 1975-85 సమయంలో తమిళ చిత్ర సీమలో అగ్ర కథానాయికగా తన హవాను కొనసాగించి.. దాదాపు అగ్రకథానాయకుల సరసన నటించింది.

అయితే శ్రీదేవి నటించిన పలు తెలుగు చిత్రాలకు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. అలాగే టాలీవుడ్ టాప్ హీరో ఎన్.టి. రామారావుతో కొండవీటి సింహం, వేటగాడు, బొబ్బిలి పులి, సర్దార్ పాపానాయుడు వంటి చిత్రాల్లో శ్రీదేవి నటించింది.

అదేవిధంగా టాలీవుడ్ మరో టాప్ హీరో అక్కినేని నాగేశ్వరరావుతో ముద్దుల కొడుకు, ప్రేమాభిషేకం, బంగారు కానుక, ప్రేమకానుక వంటి చిత్రాల్లో శ్రీదేవి కథానాయిక పాత్రను పోషించింది. ఇదేవిధంగా సూపర్ స్టార్ కృష్ణతో కలవారి సంసారం, కృష్ణావతారం, బురిపాలెం బుల్లోడు వంటి సినిమాల్లోనూ శ్రీదేవి నటించింది.
Sri Devi
FILE


ఇకపోతే.. తమిళ హీరో, పద్మభూషణ్ కమల్ హాసన్‌తో పలు చిత్రాలకు జతకట్టిన శ్రీదేవి.. తమిళ సినిమాలు చేస్తూనే.. బాలీవుడ్ రంగంలోకి అడుగుపెట్టింది. 1978 సంవత్సరంలో "సోల్వా సావన్" అనే తొలి హిందీ సినిమాలో శ్రీదేవి బాలీవుడ్ తెరగేంట్రం చేసింది. ఎక్కువ జితేంద్రతో కలిసి నటించిన శ్రీదేవి హిందీ సినిమాల్లో "హిమ్మత్వాలా" ఆమెకు మంచి గుర్తింపును సంపాదించిపెట్టింది.

ఇదిలా ఉంటే.. 1992 సంవత్సరం "క్షణక్షణం" అనే తెలుగు చిత్రానికిగానూ ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటి పురస్కారం అందుకున్న శ్రీదేవి మెగాస్టార్ సరసన నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి (1990), నాగార్జున సరసన ఆఖరి పోరాటం (1988) వంటి చిత్రాల్లో కథానాయిక నటించి మాస్ ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంది.

ఇక శ్రీదేవి వ్యక్తిగత విషయానికొస్తే.. అయ్యప్పన్ (న్యాయవాది)-రాజేశ్వరి దంపతులకు జన్మించిన శ్రీదేవికి శ్రీలత అనే ఒక సోదరి, సతీష్ అనే సోదరుడున్నారు. హిందీ సినీ నిర్మాత, హీరో అనిల్ కపూర్ సోదరుడైన బోనీ కపూర్‌తో జూన్ 2, 1996వ సంవత్సరం వివాహం జరిగింది. శ్రీదేవి దంపతులకు ఝాన్వి, ఖుషి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

పలు నంది అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్న శ్రీదేవికి నేడే పుట్టినరోజు: ఆగస్టు 13-08-1963.
జన్మస్థలం: శివకాశి (తమిళనాడు రాష్ట్రం).

ఇంకేముంది? తన అందచందాలతో భారతీయ వెండితెరలో ఓ మెరుపు మెరిసిన పొడవుకాళ్ల సుందరి, పదహారేళ్ల వయసు (1978) కథానాయిక శ్రీదేవికి మనమందరం పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుదామా...!
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: శ్రీదేవి, ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణ, చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్, హిందీ, మలయాళం