క్లాసికల్ డ్యాన్సర్‌గా తన ఐదవ ఏటనే భరతనాట్యం నేర్చుకుని.. మెల్ల మెల్లగా సినీ ఆరంగేట్రం చేసి అగ్ర హీరోయిన్ స్థాయికి ఎదిగిన అందాల ముద్దుగుమ్మ, సెక్సీడాళ్ విమలా రామన్.
ప్రముఖ తమిళ దర్శకుడు బాలచందర్ తీసిన "పొయ్" (తెలుగులో అబద్ధం)లో తెలుగు సినీ నటుడు ఉదయ్‌కిరణ్ సరసన నటించిన విమలారామన్.. మలయాళంలో పలు చిత్రాలు చేసింది.
సిడ్నీలో పుట్టి.. 2004లో "మిస్ ఇండియా ఆస్ట్రేలియా" టైటిల్ నెగ్గిన విమలా రామన్.. ఇటీవలే హ్యాపీడేస్ ఫేమ్ వరుణ్ సందేశ్ సరసన "ఎవరైనా ఎపుడైనా" చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
మలయాళంలో సురేష్ గోపి సరసన తొలి సినిమా చేసిన విమలా రామన్ తదనంతరం "ప్రణయకాలం" అనే మరో చిత్రంలో అజ్మల్ అమీర్‌తో జతకట్టింది. ఇంతేకాకుండా.. మలయాళం మెగాస్టార్ మమ్మూటితో "నస్రాని", దిలీప్‌తో "రోమియో"అనే సినిమాల్లోనూ కథానాయిక పాత్రను పోషించింది.
అంతేగాకుండా.. మూలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ సరసన నటిస్తోన్న విమలా రామన్‌కు అటు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ఛాన్సులు కూడా వెల్లువల్లా వస్తున్నాయని సినీ జనం గుసగుసలాడుకుంటున్నారు.
ఇప్పటికే టాలీవుడ్ హీరో తరుణ్‌తో ప్రేమకథా చిత్రంలో నటిస్తోంది. ఇందులో విమలా రామన్ బికినీలో అందాలను ఆరబోసి టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. మంచి పర్సనాలిటీతో అందరిని ఆకట్టుకునే అందాల తార విమలా రామన్ కూడా బికిని ధరించడానికి సై అన్నట్లు సమాచారం.
"ఎవురైనా ఎపుడైనా" సినిమాలో చక్కగా మంచి దుస్తుల్లో నిండుగా కనిపించిన విమలా రామన్.. బికినితో తన అందాలనూ ప్రదర్శించి కనువిందు చేయనుందని వినికిడి. వి.ఎన్. ఆదిత్య దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని రాజు హర్వానీ, గోగినేని శ్రీనివాస్‌లు సంయుక్తంగా సుప్రీం మూవీస్‌పై నిర్మిస్తున్నారు.
మరోవైపు తెలుగులో "చుక్కలాంటి అబ్బాయి చక్కనైన అమ్మాయి" అనే చిత్రంలో నటించేందుకు విమలా రామన్ సంతకాలు కూడా చేసేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.