గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » అడ్రస్ డైరీ » టీనేజ్ గర్ల్, 'దేశముదురు' భామ "హన్సిక" పర్సనల్ టచ్ (Hansika| Desamuduru| Alluarjun| Kantri| Maska| Jayeebhava| Anushka| Hindi)
అడ్రస్ డైరీ
Feedback Print Bookmark and Share
 
Hansika
WD
"దేశముదురు" చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన తెల్లపిల్ల, అందాల ముద్దుగుమ్మ, టీనేజ్ గర్ల్ హన్సిక.

బాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్టుగా "ఎస్కేప్ ఫ్రమ్ తాలిబన్" చిత్రం ద్వారా రంగప్రవేశం చేసింది. తర్వాత హవా, కోయి.. మిల్ గయా, జాగో, అబ్రాకా దబ్రా, హుమ్ ఖాన్ హాయ్ వంటి ఆరేడు హిందీ చిత్రాల్లో బాలనటిగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది.

టాలీవుడ్‌కు కథానాయిగా "దేశముదురు" ద్వారా అల్లుఅర్జున్ సరసన నటించిన ఈ భామకు, 2004 సంవత్సరానికి గానూ ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటీమణి అవార్డు లభించింది. తర్వాత కంత్రి, మస్కా, బిల్లా వంటి చిత్రాల్లో ప్రేక్షకుల మదిని దొంగలించిన హన్సిక.. తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ సరసన చేసిన "జయీభవ" సినిమాలో నటించింది.

మరోవైపు "దేశముదురు" హీరో అల్లు అర్జున్‌తో మళ్లీ హన్సిక జతకట్టనుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. ముదురులో సిక్స్‌ప్యాక్ బాడీని పెంచుకుని మంచి మార్కులు కొట్టేసిన అర్జున్ చేసే తాజా సినిమా "వేదం"లో హన్సిక కథానాయికగా నటించనున్నట్లు తెలిసింది. "గాయం" ఫేమ్ క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బిల్లా సెక్సీడాళ్ అనుష్క కూడా కీలక పాత్ర పోషిస్తోంది.

ఇకపోతే.. ముంబైలో వాణిజ్యవేత్త ప్రదీప్ మొత్వాని, మోనా మొత్వాని దంపతులకు జన్మించిన హన్సిక పోడార్ ఇంటర్నేషనల్ స్కూలులో చదివింది. మోడల్, టెలివిజన్ స్టార్, బాలనటిగా రాణించిన హన్సిక పలు యాడ్ ఫిలిమ్స్‌ కూడా చేసింది. తెలుగు, సినిమాలే గాకుండా కన్నడంలో "బిందాస్" వంటి సూపర్ హిట్ మూవీలో నటించిన హన్సిక, తమిళంలో "మాప్పిళ్లై" అనే చిత్రం ద్వారా కోలీవుడ్ ఆరంగేట్రం చేసింది.

తన సినీ కెరీర్‌లో గొప్ప నటీమణిగా ఎదగాలని ఆకాంక్షిస్తున్న హన్సికకు ఆల్‌దిబెస్ట్ చెబుతూ ఆమె వ్యక్తిగత విషయాలు తెలుసుకుందాం.
పుట్టిన రోజు.. ఆగస్టు 9, 1991 (1991-08-09),
జన్మస్థలం: ముంబై,
వయసు: 18 సంవత్సరాలు,
ఇతర పేర్లు: సీమా మొత్వాని, హన్సిక మొత్వాని.
తెలిసిన భాషలు: హిందీ, తెలుగు, మరాఠి, బెంగాలీ, ఇంగ్లీష్, తుళులతో పాటు మాతృభాష సింధి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: హన్సిక, దేశముదురు, అల్లు అర్జున్, కంత్రి, మస్కా, జయీభవ, అనుష్క, హిందీ, బాలనటి, మోడల్