పెరుగుతున్న ముమైత్ ఖాన్ డిమాండ్
తెలుగు చిత్రాల్లో సెక్సీ క్వీన్ ముమైత్ ఖాన్ ఓ పాటలో నటించడం తప్పనిసరిగా మారుతోంది. 'పోకిరి' చిత్రంలో ఇంకా 'నా వయస్సు నిండా పదహారే..' అంటూ యువతను ఉర్రూతలూగించిన ముమైత్.. రెండు చిత్రాల్లో సోలో హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ప్రతి రెండు తెలుగు చిత్రాల్లో ఒకదానిలో ముమైత్ నటిస్తూ రెండు చేతులా ఆర్జిస్తోంది. ఇందుకు తాజా ఉదాహరణే.. ప్రముఖ హాస్య నటుడు ఎమ్మెస్ నారాయణ దర్శకత్వంలో తెరకెక్కతున్న 'భజంత్రీలు' (ఎవరికైనా వాయిస్తాం) అనే చిత్రంలో ఓ ఐటం సాంగ్‌ను ముమైత్ చేయనుంది.
ఇప్పటికే మైసమ్మ ఐపీఎస్ చిత్రంలో హీరోయిన్‌గా చేస్తున్న ముమైత్ తాజాగా ఈ చిత్రంలో ఐటం సాంగ్ చేయడానికి అంగీకరించడం విశేషం. ఈ చిత్రంలో హీరోలుగా శివాజీ ఎమ్మెస్ నారాయణ కుమారుడు విక్రమ్‌లు నటిస్తున్నారు. హైదరాబాద్‌లోని రామకృష్ణా స్టూడియోస్‌లో వేసిన సెట్‌లో వీరిపై దర్శకుడు పాటను చిత్రీకరించారు. హీరోయిన్‌గా 30 నుంచి 35 లక్షలు, ఐటం సాంగ్‌కు 5-7 లక్షలు డిమాండ్ చేస్తున్న ముమైత్.. ఈ మొత్తం పేమెంట్‍ను ఏకకాలంలోనే ఇవ్వాల్సిందేనని షరతు కూడా విధిస్తోంది. అదే.. తెలుగు చిత్రాల్లో ముమైత్‌కు ఉన్న డిమాండ్.