1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

''దేశముదురు'' సరసన హీరోయిన్ షీలా

'బొమ్మరిల్లు' ఫేం భాస్కర్ దర్శకత్వంలో 'దిల్' రాజు నిర్మిస్తున్న చిత్రంలో 'దేశముదురు' అల్లు అర్జున్ సరసన హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని
'బొమ్మరిల్లు' ఫేం భాస్కర్ దర్శకత్వంలో 'దిల్' రాజు నిర్మిస్తున్న చిత్రంలో 'దేశముదురు' అల్లు అర్జున్ సరసన హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని 'రాజుభాయ్' హీరోయిన్ కొట్టేసింది. దేశముదురు చిత్రం తర్వాత టాలీవుడ్ కండల వీరుడుగా ప్రశంసలు అందుకుంటున్న అల్లు అర్జున్‌కు జోడీగా భావన, ప్రియమణిలతో పాటు.. పలువురు హీరోయిన్ల పేర్లను పరిశీలించారు.

అయితే.. 'రాజభాయ్', 'హలో ప్రేమిస్తా' వంటి చిత్రాల్లో నటించిన షీలాను ఈ కొత్త చిత్రంలో ఎంపిక చేశారు. అయితే ఇందుకు సంబంధించి అధికారపూర్వకమైన వార్తలు మాత్రం వెలువడ లేదు. చిత్రం యూనిట్ వర్గాలు మాత్రం షీలాను ఎంపిక చేసినట్టు పేర్కొంటున్నాయి. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభంకానుంది.
About Writer
PNR