ఈనెల 19న "చందమామ" ఆడియో విడుదల
నవదీప్, శివబాలాజీ, కాజల్, సింధు మీనన్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న "చందమామ" చిత్రం ఈ నెల (ఆగస్ట్) 19వ తేదీన విడుదల చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణవంశీ దర్శకత్వంతో సి. కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి ఆఖరి పాటను హైదరాబాద్ పరిసరాల్లో చిత్రీకరించారు. దీంతో షూటింగ్ పూర్తయింది.
ఈ చిత్రం గురించి నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ... మన సంస్కృతి, నాగరికతకు అద్దంపట్టే చిత్రం తండ్రీ కూతుళ్ళ అనుబంధాల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతుంది. కూతురుని పంచ ప్రాణాలుగా చూసుకునే ఓ తండ్రి, ఆయన మనసు ఎక్కడ నొచ్చుకుంటోందనని మనస్సు విప్పి మాట్లాడలేని సున్నిత మనస్కురాలైన కూతురు నడుమ జరిగే మెలో డ్రామా ఈ కథలో ప్రధాన పాయింట్.
నిర్మాతగా 28 సినిమాల్లో పొందలేని అనుభూతి ఈ చిత్రం నాకు కల్పించింది. మరోవైపు నిర్మాణానంతరం కార్యక్రమాలు ఈ నెలాఖరులో పూర్తికానున్నాయి. సెప్టంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత చెప్పారు.
ఈ చిత్రానికి కెమెరా... ప్రసాద్ మురెళ్ళ, సంగీతం... కె.ఎం. రాధాకృష్ణన్, ఎడిటింగ్...శంకర్, పాటలు... అశోక్ తేజ, అనంత శ్రీరామ్, వనమాలి, సాయి శ్రీ హర్ష.