పోలీస్‌గా విశాల్ నటించే "సెల్యూట్"
"ప్రేమచదరంగం", "పందెంకోడి", "భరణి" వంటి డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు వారికి పరిచయం అయిన కథానాయకుడు విశాల్ తాజాగా తెలుగులో "సెల్యూట్" చేస్తున్నాడు. దర్శకుడు సురేష్ కృష్ణ దగ్గర పనిచేసిన రాజశేఖర్ దర్శకునిగా పరిచయం అవుతున్నాడు. విక్రమ్ కృష్ణ నిర్మాత. బుధవారం అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. దేవుని పటాలపై ముహూర్తపు షాట్ చిత్రీకరించారు.
డా.డి. రామానాయుడు క్లాప్ కొట్టగా, దేవీవరప్రసాద్ కెమేరా స్విచ్చాన్ చేశారు. పూరీ జగన్నాథ్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా విశాల్ ఈ చిత్రం గురించి చెబుతూ... తొలిసారిగా తెలుగులో నటిస్తున్నాను. ఉపేంద్ర, కోట కీలకపాత్రలు పోషిస్తున్నారు. పోలీసు అధికారిగా నేను నటిస్తున్నాను. "రామోజీ ఫిలిం సిటీలో ఇంతవరకు తెలుగు సినిమాల్లో చూడని అద్భుతమైన సెట్స్ తోటతరణి నేతృత్వంలో వేశారు.
15 రోజుల గ్యాప్ తర్వాత 50 రోజులు పాటు నిరవధిక షెడ్యుల్లో చిత్రం పూర్తవుతుంది. ఇందులో ఆరు పాటలున్నాయి. సిటీ బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం అందరినీ అలరిస్తుందని భావిస్తున్నానని" చెప్పారు. "నిజ జీవితంలో జరిగిన ఓ సంఘటనకు తెర రూపమే ఈ చిత్రకథ" అని నిర్మాత విక్రమ్ కృష్ణ అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ... ప్రముఖ పత్రికలో జర్నలిస్టుగా చేసిన తర్వాత దర్శకుడు సురేష్‌కృష్ణ దగ్గర పనిచేశాను. పవర్‌ఫుల్ పోలీస్ పాత్రను విశాల్ పోషిస్తున్నాడు. ఇది ఆయనకు టైలర్‌మేడ్. అందరికీ ఈ చిత్రం మంచి గుర్తింపు తెస్తుందని.... అన్నారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారని దర్శకుడు సురేష్ కృష్ణ అన్నారు. వీరితో పాటు అలీ, చంద్రమోహన్ , జీవా, రవికాలే తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.