1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

ఈ నెలాఖరులో "నీకు-నాకు" విడుదల

నటి
నటి "రంభ" నటిస్తోన్న చిత్రం "నీకు-నాకు". దీనికి "సమ్‌థింగ్..సమ్‌థింగ్" అనే కాప్షన్‌కూడా జోడించారు. శ్రీ సర్వసాయి ఫిలింస్ పతాకంపై సాయిరత్నం నిర్మిస్తున్నారు. సెల్వేంద్రన్ దర్శకుడు. ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు ముగించుకుని ఈ నెలాఖరులో విడుదలకు సిద్ధమైంది.

ఈ విషయాన్ని నిర్మాత సాయిరత్నం తెలియజేస్తూ... దర్శకుడు "శంకర్" వద్ద "ప్రేమికుడు" నుంచి "అపరిచితుడు" వరకూ కో-డెరక్టర్‌గా పనిచేసిన "సెల్వేంద్రన్" ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హీరోగా "శరత్" పరిచయం అవుతున్నారని.. తెలిపారు. కథానాయిక రంభ మాట్లాడుతూ, హీరోయిన్‌గా ఇంతవరకూ చేసినా ఈ చిత్రంలో విభిన్నమైన పాత్రను పోషించాను. దర్శకుడు ఈ పాత్రను చక్కగా మలిచారు. "ప్రేక్షకులు ఆదరిస్తారని" భావిస్తున్నానని తెలిపారు.

ఇంకా ఈ చిత్రంలో లక్ష్మీరాయ్, కీర్తన, అభినయశ్రీ. తెలంగాణ శకుంతల, రాజశ్రీ, రాజశ్రీ, సూర్య, రాజ్యలక్ష్మి, బ్రహ్మానందం, సుమన్ శెట్టి, బబ్లూ, గిరిబాబు, జీవా, పొన్నాంబళం, లక్ష్మీపతి, సన, రఘునాథరెడ్డి తదితరులు నటిస్తున్నారు. కథ: రాధాకృష్ణ, మాటలు: రాజేష్, సంగీతం: భరణి, ఛాయాగ్రహణం: దివాకర్, నిర్మాత: సాయిరత్నం, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సెల్వేంద్రన్.
About Writer
WD