1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

యాక్షన్ నేపథ్యంలో కొత్త చిత్రం ప్రారంభం

కిరీటి
WD PhotoWD
కిరీటి, హరిప్రీతి చాబ్లాలను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ శ్రీ కళాచిత్ర అనే నూతన సంస్థ ఓ చిత్రాన్ని ప్రారంభించింది. "బావామరదళ్ళసవాల్", "రౌడీ అన్నయ్య" వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన సి.హెచ్. వెంకట్ గణేశ్ కొంత విరామం తర్వాత దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఎన్.భాస్కరరావు, బి.రమణారావు, సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం రామానాయుడు స్టూడియోలో హీరోహీరోయిన్లపై ముహూర్తపుషాట్‌ను చిత్రీకరించారు.

ఈ సన్నివేశానికి ఆర్. నారాయణ మూర్తి క్లాప్ కొట్టగా, నిర్మాత శ్రేయోభిలాషి "సైకిల్" స్వామి కెమేరా స్విచ్చాన్ చేశారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో నిర్మాతల్లో ఒకరైన భాస్కర రావ్ చిత్రం గురించి చెబుతూ... యాక్షన్ నేపథ్యంలో సాగే చిత్రమిది. నారాయణ మూర్తి సహకారంతో నిర్మాణంలో ప్రవేశించాం. ఇకపై ఏకధాటిగాసాగే షెడ్యూల్తో సినిమాను పూర్తిచేస్తామని... అన్నారు. "ప్రజా నాట్యమండలి కళాకారునిగా తన ఉనికి చాటుకుంటూ మంచి చిత్రాలు నిర్మించాలనీ, చిత్రంలో పనిచేస్తున్న అందరికీ గుర్తింపురావాలని ఆర్. నారాయణమూర్తి అభిలాషించారు.

"తాను కట్టాసుబ్బారావు వద్ద పలు చిత్రాలకు పనిచేశాననీ, కొంతకాలం గ్యాప్ ఇచ్చినా అదే ఉత్సాహంతో మరలా దర్శకత్వం చేస్తున్నానని సి.హెచ్. వెంకట్ గణేశ్ తెలిపారు. తాను వేజెళ్ళ సత్యనారాయణ చిత్రాలనుంచి సంగీతదర్శకునిగా పనిచేస్తున్నాననీ, ఇందులో ఐదు పాటలుంటాయనీ, మెలోడీ, ఫాస్ట్‌బీట్, వెస్ట్రన్ తరహాలు ట్యూన్స్ అందిస్తున్నానని శివాజీ రాజా అన్నారు. ఈ చిత్రానికి మాటలు: ఘంటసాల నరసింహారావు, కెమెరా: సి.గోపాలరావు, సంగీతం: శివాజీ రాజా, ఆర్ట్: వెంకటేశ్, సమర్పణ: తవ్వా నాగేశ్వరరావు, కథ స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సిహెచ్. వెంకట్‌ గణేశ్.
About Writer
WD