1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

''బుజ్జిగాడు'' మేడ్ ఇన్ చెన్నైగా రానున్న ప్రభాస్

'ఇడియట్'
'ఇడియట్', 'పోకిరి' వంటి వైవిధ్యభరితమైన టైటిల్స్‌తో చిత్రాలు తీసి, బాక్సాఫీస్ హిట్లు అందించిన పూరీ జగన్నాథ్, ప్రభాస్ హీరోగా 'బుజ్జిగాడు' మేడ్ ఇన్ చెన్నై అనే చిత్రాన్ని తీయనున్నారు. ఇప్పటికే.. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్‌తేజను 'చిరుత'గా వెండితెరకు పరిచయం చేస్తున్న పూరీ.. ప్రభాస్‌తో ఓ చిత్రాన్ని చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు.

అయితే చిత్రం షూటింగ్ మాత్రం వచ్చేనెల 16వ తేదీన నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనిపై పూరీ మాట్లాడుతూ.. ఇప్పటివరకు ప్రభాస్ హీరోగా నటించిన చిత్రాలను నేను చూడలేదని, అయితే.. ఆ హీరోతో మాత్రం చిత్రాన్ని చేయాల్సివస్తే.. అపుడు చూస్తానని చెప్పారు. ఇటీవల 'మున్నా'గా వచ్చి అంతగా ఆకట్టుకోలేక పోయిన ప్రభాస్.. ప్రస్తుతం బుజ్జిగాడు చిత్రం ఫోటో సెషన్స్‌, గెటప్స్, ఇతర అంశాల్లో నిమగ్నమైఉన్నారు.

ప్రభాస్ సరసన త్రిష హీరోయిన్‌గా ఎంపిక కాగా.. కన్నడ నటి సంజన కూడా నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ చిత్రానికి కెమరా.. శ్యామ్ కె.నాయుడు, ఎడిటర్.. మార్తాండ్ కె.వెంకటేష్, సంగీతం.. దేవీశ్రీ ప్రసాద్, పాటలు.. కందికొండ, నిర్మాత.. కేఎస్.రామారావు.
About Writer
PNR