వచ్చే నెల ఐదున ''అతిథి'' ఆడియో విడుదల
మహేష్ బాబు, అమృతారావు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న 'అతిథి' చిత్రం.. ఆడియో వచ్చే నెలలో విడుదలకానుంది. మహేష్ బాబు అన్న రమేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్ర కథలో ఎక్కువ పాళ్లు అప్యాయతలు, అనురాగాలకు పెద్దపీట వేసి ఓ చక్కని కథా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. అయితే.. ఇలాంటి చక్కని కుటుంబంలోకి 'అతిథి'గా వచ్చిన వ్యక్తి ఏం చేస్తాడు.?
అసలు 'అతిథి'గా రావడానికి కారణం ఏమిటి? అనేదే చిత్రం ఇతివృత్తం. మణిశర్మ సంగీత బాణీలు సమకూర్చిన ఈ చిత్రం ఆడియోను వచ్చేనెల ఐదో తేదీన విడుదల చేయనున్నారు. అలాగే.. సినిమాను అక్టోబరు మూడో తేదీన విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ చిత్రానికి కెమెరా.. సమీర్ రెడ్డి, మాటలు.. అబ్బూరి రవి, రచనా, సహకారం.. వక్కంతం వంశీ.