హెలికాప్టర్‌లో ''బ్రహ్మానందం'' విహారం
తెలుగు చిత్రసీమలో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం హెలికాప్టర్‌లో విహారం చేశారు. ఆర్.ఎస్.ఫిలింస్ పతాకంపై ఉదయకిరణ్ హీరోగా, దియా హీరోయిన్‌గా పోలిశెట్టి రాంబాబు నిర్మిస్తున్న 'లక్ష్మీపుత్రుడు' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో కామెడీ సన్నివేశాలను బ్రహ్మానందంపై బెంగుళూరు సమీపంలోని తుమ్కురు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఇందుకోసం హెలికాప్టర్‌ను ఉపయోగించారు.
ఇదే అదునుగా భావించిన బ్రహ్మానందం ఆ హెలికాప్టర్‌లోనే బెంగుళూరును చుట్టి వచ్చారు. దీనిపై బ్రహ్మానందం మాట్లాడుతూ.. నాకు జోడీగా సెక్సీ క్వీన్ ముమైత్‌ఖాన్‌ను ఎంపిక చేయడమే కాకుండా.. హెలికాప్టర్ ఉపయోగించడం నిర్మాత తనపై ఉంచిన నమ్మకాన్ని మరింత రుజువు చేసిందన్నారు. ఈ చిత్రంలో ముమైత్-తనపై చిత్రీకరించిన సన్నివేశాలు చిత్రానికే హైలెట్‌గా నిలుస్తాయన్నారు.
అనంతరం నిర్మాత రాంబాబు మాట్లాడుతూ.. మా చిత్రంలో యూత్, యాక్షన్, సెంటిమెంట్ ఏ స్థాయిలో ఉంటుందో.. అదే స్థాయిలో కామెడీకి ప్రాధాన్యత ఉంటుందని, కథలోని డిమాండ్ మేరకే హెలికాప్టర్‌ను వాడాల్సి వచ్చిందని వివరించారు. ఈ చిత్రానికి కెమెరా..సురేష్, సంగీతం.. ఇమాన్, ఫైట్స్.. దినేష్, దర్శకత్వం.. రాజ్‌కపూర్.