డైరక్టుగా మార్కెట్‌కు రానున్న ''చిరుత'' ఆడియో
మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ తేజ్ హీరోగా నటిస్తునన 'చిరుత' చిత్రం ఆడియో బుధవారం రాత్రి విడుదలకావాల్సి ఉంది. ఇందుకోసం మెగాస్టార్ పుట్టిన రోజైన బుధవారం (ఆగస్టు 22వ తేది) రాత్రి నిరాడంబరంగా విడుదల చేసేందుకు గచ్చిబౌలి స్టేడియాన్ని వేదికగా ఎంచుకున్నారు. అయితే.. చిరంజీవి అకస్మాత్తుగా లండన్ వెళ్ళాల్సి రావడంతో.. 'చిరుత' ఆడియోను డైరక్టుగా ఆదిత్య మ్యూజిక్ మార్కెట్ చేసే ఏర్పాట్లు చేయనుంది.
దీనిపై చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ.. ముందుగా అనుకున్నట్టు కాకుండా 'చిరుత' ఆడియో డైరక్టుగా మార్కెట్‌లోకి విడుదల అవుతుందన్నారు. దీనికి మరో కారణం కూడా ఉందని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన 'శంకర్‌దాదా జిందాబాద్' చిత్రం ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వక పోవడంతో ఇటు చిరంజీవి, అటు ప్రేక్షకులు నిరాశకు లోనయ్యారన్నది ఆ టాక్. అందువల్ల చిరంజీవి దూరంగా వెళ్లారని భోగట్టా.