1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

నవంబరులో ''మైసమ్మ ఐపిఎస్‌''గా సెక్సీక్వీన్

దర్శకరత్న
WD PhotoWD
దర్శకరత్న, డాక్టర్ దాసరి నారాయణరావు కథ, స్క్రీన్ ప్లే సమకూర్చిన 'మైసమ్మ ఐపీఎస్' చిత్రం వచ్చే నెలలో తెరముందుకు రానుంది. ఈ చిత్రాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 150 ప్రింట్లతో విడుదల చేయనున్నారు. దాసరి పద్మ సమర్పణలో ముమైత్ ఖాన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్‌ను జరుపుకుంటోంది.

కథకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను హైదరాబాద్‌లోని భరత్ అల్యూమినియం ఫ్యాక్టరీలో దర్శకుడు భరత్ చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్‌లో ముమైత్‌తో పాటు.. షాయాజీషిండే, ప్రదీప్ రావత్, ప్రసన్నకుమార్‌లతో పాటు.. వంద మందికిపైగా ఆర్టిస్టులు పాల్గొన్నారు. ఈనెల 13వ తేదీ వరకు ఏకధాటిగా హైదరాబాద్‌లోని పలు పరిసర ప్రాంతాల్లో చిత్రం షూటింగ్ జరుపుతామని భరత్ వెల్లడించారు.

చిత్రంపై నిర్మాత షిండే మాట్లాడుతూ.. గ్రామీణ వాతావరణం నుంచి సిటీకి వచ్చి రాజకీయాల్లోకి ప్రవేశించేలా తన పాత్ర ఉంటుందన్నారు. నా పాత్ర పేరు దున్నపోతుల సాంబశివరావు. ఇటువంటి పాత్రను నేను తొలిసారిగా పోషిస్తున్నట్టు చెప్పారు.

ఈ చిత్రానికి మాటలు.. పి.రాజేంద్రప్రసాద్, సంగీతం.. శ్రీలేఖ, కెమెరా.. సురేందర్ రెడ్డి, నిర్మాత.. కె.రామకృష్ణ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత.. జి.జగదీష్ చంద్రప్రసాద్.
About Writer
PNR