1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

సంక్రాంతికి బాలకృష్ణ ''ఒక్కమగాడు''

'మహారథి' చిత్రం ప్లాప్ తర్వాత బాలకృష్ణకు ఓ మంచి హిట్ చిత్రం లేదు. తన వీరాభిమాని కుమారుడైన బాలకృష్ణకు ఓ మంచి హిట్
'మహారథి' చిత్రం ప్లాప్ తర్వాత బాలకృష్ణకు ఓ మంచి హిట్ చిత్రం లేదు. తన వీరాభిమాని కుమారుడైన బాలకృష్ణకు ఓ మంచి హిట్ ఇవ్వాలన్న తాపత్రయంతో దర్శకనిర్మాత వైవీఎస్.చౌదరి ప్రతిష్టాత్మకంగా తీస్తున్న చిత్రం 'ఒక్కమగాడు'.

పక్కా స్క్రిప్ట్‌తో తన సొంత బ్యానర్ బొమ్మరిల్లు పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే డిసెంబరు నాటికి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నారు.

ఈ చిత్రంలో ప్రేక్షకులు ఊహించని విశేషాలెన్నో ఉంటాయనీ బాలకృష్ణ అభిమానులకు పండగలాంటిదని ఇటీవలే దర్శకుడు చౌదరి చెప్పారు. ఇందులో బాలకృష్ణ తాతామనవళ్ళుగా నటిస్తున్నారు. తాత పాత్రకు జోడిగా సిమ్రాన్, అనుమడి పాత్ర సరసన అనుష్క, నిషాకొఠారిలు నటిస్తున్నారు.
About Writer
PNR