గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » "బతుకమ్మ" పాటలు విడుదల
కథనాలు
Feedback Print Bookmark and Share
 
తెలంగాణ ప్రాంతంలో దసరా వేడుకల మధ్య పల్లె నుంచి పట్టణం దాకా ప్రతి ఇంటా మహిళా మణులు అత్యంత భక్తి విశ్వాసాలతో "బతుకమ్మ" పండుగను జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో తెలుగు వెండితెరపై తొలిసారిగా "బతుకమ్మ" పండుగ ఇతివృత్తంగా టి. ప్రభాకర్ దర్శకత్వంలో సింధు తులానీ ప్రధాన పాత్రలో నటిస్తున్న"బతుకమ్మ" షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

వరంగల్ పట్టణానికి చేరువలోని నెమలికొండ గ్రామంలో "బతుకమ్మ"ను శిరస్సున దాల్చిన 300 మంది మహిళలతో చిత్రానికి సంబంధించిన ప్రధాన ఘట్టాలను దర్శకుడు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చిత్రీకరించాడు. ఇదే సందర్భంగా 11 పాటలతో కూడిన "బతుకమ్మ" చిత్రం తొలిక్యాసెట్‌ను వరంగల్ మేయర్ టి. స్వర్ణ విడుదల చేశారు.

తొలిక్యాసెట్‌ను చిత్ర కథానాయిక సింధుతులానీ అందుకున్నారు. క్యాసెట్‌ విడుదల అనంతరం చిత్ర సమర్పకుడు టి. రాజేశ్వర రావు మాట్లాడుతూ... "బతుకమ్మ"పండుగ సందర్భంగా చిత్రం పాటల క్యాసెట్‌ విడుదల చేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. క్యాసెట్‌లోని పాటలు పండుగ వాతావరణానికి సరిపోతాయని తెలిపారు.

చిత్రంలో తాను పోషిస్తున్న పాత్ర పట్ల పలువురు తనను అభినందించారని సింధుతులానీ పేర్కొన్నారు. అనంతరం చిత్ర దర్శకుడు మరియు సంగీత దర్శకుడు టి. ప్రభాకర్ మాట్లాడుతూ.. కేవలం తెలంగాణ ప్రజలకే కాక అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలకు నచ్చే రీతిలో చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని డిసెంబరులో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.