కొత్తముఖాల అన్వేషణలో "చిత్రం" తేజ
|
కింగ్ ఫిషర్, మా టీవీ, కామన్ కల్చర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై లిమిటెడ్ సంయుక్తంగా ఈ స్టార్ హంట్ నిర్వహిస్తోంది. "ఈ సినిమాతో ఎవరైనా స్టార్ కావచ్చు"!. అది మీరే ఎందుకు కాకూడదు... అంటూ తేజ అన్నారు. మన ఇండస్ట్రీకి కొత్తవాళ్ళు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.
మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు కొత్తగా వచ్చిన నటుడే. పేరు, ఇంటి అడ్రస్సు, ఫోన్ నెంబర్‌తో పాటు రెండు ఫోటోలు పంపించాల్సి ఉంటుంది. ఈ వివరాలు పంపాల్సిన చిరునామా: "కింగ్ ఫిషర్ స్టార్", మా టెలివిజన్ నెట్‌వర్క్, టాపడ్ బిల్డింగ్ వెనుకవైపు, పంజాగుట్ట, హైదరాబాద్- 500082.
అప్లికేషన్ స్క్రీనింగ్ ఎంపికైన వాళ్ళకి సమీప ప్రదేశాలు వైజాగ్, విజయవాడ, వరంగల్, హైదరాబాద్‌లో ఆడిషన్ టెస్టు ఉంటుందని తేజ చెప్పారు. వయసుతో నిమిత్తం లేకుండా క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమెడియన్స్, విలన్స్ ఇతరత్రా పాత్రలు పోషించాలనుకునే కొత్త వారిని కూడా ఈ ఆడిషన్ టెస్ట్‌లో సెలెక్ట్ చేస్తామని చెప్పారు. ఈస్టార్ హంట్ కార్యక్రమానికి నిర్మాతల మండలి అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత సురేష్ తమ వంతు సహాయం అందించనున్నారని తేజ అన్నారు.