గోదావరిలో అల్లు అర్జున్ కొత్త చిత్రం
Publish: Wed, 21 Nov 2007 (13:25 IST)
Updated: Wed, 21 Nov 2007 (13:16 IST)
శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ అల్లు అర్జున్‌తో ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. షీలా కథానాయికగా నటించనున్న ఈ చిత్రానికి భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హ్యాపీడేస్ తర్వాత చాలా సంతోషంగా ఉన్న దిల్‌రాజు ఈ చిత్రం క్రేజ్‌తెస్తుందనీ, యువత ఆకట్టుకునే అంశాలతో రూపొందుతోందని అన్నారు. ఇటీవలే కేరళలో కొన్ని సన్నివేశాలను తెరకెక్కించామని చెప్పారు. ప్రస్తుతం గోదావరి జిల్లాలో ఈ చిత్రం షూటింగ్ సాగుతుందని వెల్లడించారు. పల్లె వాతావరణాన్ని ప్రతిఫలించే కొన్ని సన్నివేశాలు అక్కడి గ్రామాల్లో చిత్రీకరిస్తామన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ.