1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

టైటిల్ నచ్చలేదనన్నాను : కృష్ణభగవాన్

జాన్ అప్పారావు చిత్రం ఓపెనింగ్స్‌ మీడియా ఎంత తోడ్పడింది ప్రత్యేకం వార కృతజ్ఞతలు చిత్ర దర్శక నిర్మాత కూచిపూడి వెంకట్
FileFILE
జాన్ అప్పారావు 40+ చిత్రం ఓపెనింగ్స్‌కు మీడియా ఎంతగానో తోడ్పడిందని ఇందుకు ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చిత్ర దర్శక, నిర్మాత కూచిపూడి వెంకట్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 60 ప్రింట్లతో సినిమాను విడుదల చేశాం. కోస్తా ఆంధ్రాలో కృష్ణభగవాన్ క్యారెక్టర్‌కు మంచి స్పందన వస్తోందని తెలిపారు.

కృష్ణ భగవాన్ మాట్లాడుతూ, సినిమా చేసేముందు టైటిల్ నాకు నచ్చలేదని చెప్పాను. దర్శకుడు బావుంటుందని ఒప్పించారు. సినిమా రిలీజ్ అయ్యాక టైటిల్ హెల్ప్ అయి ఓపెనింగ్స్ బాగా వచ్చాయని తెలిసింది. సిమ్రాన్ కూడా నటించడం చాలా హెల్ప్ అయిందని, ఈ చిత్రాన్ని ఇంకా ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నానని చెప్పారు.
About Writer
Gayathri