Last Modified:
Saturday, 22 March 2008 (17:55 IST)
సమాజసేవలో రమ్యకృష్ణ
Publish: Sat, 22 Mar 2008 (17:55 IST)Updated: Sat, 22 Mar 2008 (17:55 IST)
WD
తాను సమాసేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే రోటరీక్లబ్‌లో చేరానని నటి రమ్యకృష్ట చెప్పారు. శనివారం రోటరీ క్లబ‌్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, "ప్రపంచ వ్యాప్తంగా రోటరీక్లబ్ అంటే మంచి పేరు ఉంది. మానవ సేవే మాధవ సేన నినాదంతో వారు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వారు చేసిన పనులు నచ్చి నేనూ వారితో ముందుకు సాగుతున్నాను. నేడు ప్రపంచంలో శాంతి, అహింస లోపించింది. ఆ దిశగా ప్రజలందరూ ముందుకు సాగాలనికోరుకుంటున్నానని చెప్పారు".