"హ్యాపీ బర్త్ డే" టూ... రాణీ ముఖర్జీ
|
ఆ తర్వాత ఆమె నటించిన ద్వితీయ చిత్రం "కుచ్ కుచ్ హోతా హై" అనే చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రం కమర్షియల్‌గా విజయం సాధించడమే కాకుండా.. ఇందులో నటించిన హీరో హీరోయిన్లకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వచ్చిన "బ్లాక్" చిత్రంలో రాణీ ముఖర్జీ తనను తాను ఓ నటిగా నిరూపించుకుంది. అటు హిందీలోనే కాకుండా.. దక్షిణ భారతంలో కూడా రాణీ ముఖర్జీ తన అందచందాలను ప్రదర్శించారు. 2000 సంవత్సరంలో తమిళ హీరో పద్మశ్రీ కమల్ హాసన్ సరసన "హే రామ్" చిత్రంలో నటించారు.
ఈ చిత్రం 2001 సంవత్సరానికి గాను భారతదేశం తరపు ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయింది. అయితే... అవార్డు రేసులో వెనుకపడింది. ఆ తర్వాత "యువ", "హమ్ తుమ్", "సాథియా", "ఛల్తే ఛల్తే", "వీర్ జారా" వంటి చిత్రాలు రాణీకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం సైఫ్ ఆలీ ఖాన్ సరసన రాణీ నటిస్తున్న చిత్రం జూన్ 27వ తేదీన విడుదల కానుంది. ఇదిలావుండగా ఈ భామ ఇటీవల వార్తా పత్రికల్లో ప్రధాన శీర్షికల్లో దర్శనమిచ్చింది. యువదర్శకుడు ఆదిత్యా చోప్రాతో ప్రేమలో మునిగి పోయిందని, వీరిద్దరు త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి.