1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

సరికొత్త రికార్డును సృష్టించిన జల్సా

సరికొత్త రికార్డు సృష్టించిన జల్సా ఇలియానా పవన్ కల్యాణ్
WD
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, ఇలియానా జంటగా నటించిన 'జల్సా' కేవలం వారం రోజుల వ్యవధిలో 21 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టిందని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తెలిపారు. ఒక్క తెలుగు సినీ చరిత్రలోనేకాదు.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లను చేసే చిత్రాల జాబితాను ప్రకటించే "బాక్సాఫీస్ మేజో" టాప్ 10 లిస్టులో 9వ స్థానాన్ని జల్సా కైవసం చేసుకోవటం తెలుగు సినిమాలకున్న సత్తా ఏమిటో నిరూపించిందని అన్నారు. జల్సా చిత్రం వల్ల చిన్న ధియేటర్లకు ఎటువంటి నష్టం వాటిల్లదని చెప్పారు.

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి రాజకీయ ప్రవేశం.. మరో రెండు నెలలో ఉంటుందని ప్రకటించిన నేపధ్యంలో... ఈ విషయంపై మళ్లీ అరవింద్‌ను కదిలిస్తే... "నేను ఆ రోజు ఏం చెప్పానో.. ఇప్పుడూ అదే చెపుతాను" అన్నారు. చిరంజీవి నటించబోయే తదుపరి చిత్రం అధినాయకుడు ఎప్పుడు అన్న ప్రశ్నకు... "ఆయన మా బ్యానర్ లో నటిస్తే.. ఎంతో సంతోషిస్తాను. అయితే ఆయన నిర్ణయం ఏమిటన్నది తెలియద"ని సమాధానమిచ్చారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT