1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

తెరపై మళ్లీ విలన్‌గా మోహన్‌బాబు

తెరపై విలన్‌ మోహన్‌బాబు
WD PhotoWD
సినీరంగంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అడుగుపెట్టి అటుపై విలన్‌గా రాణించిన మోహన్‌బాబు తర్వాత పూర్తిస్థాయి హీరోగానే నటించడం ప్రారంభించారు. కానీ ఈ మధ్య కాలంలో మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్‌ను మలుచుకున్న మోహన్‌బాబు కొన్నేళ్ల క్రితం అన్నమయ్య చిత్రంలో చేసిన గెస్ట్ రోల్ తరహా పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

ఆ తరహాలో తాజాగా ఆయన జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటించిన యమదొంగ చిత్రం మంచి విజయాన్నే సాధించింది. దీంతో ఆయన ఇలాంటి పాత్రలకు బాగా ప్రాముఖ్యమిస్తున్నారు. త్వరలో ప్రభాస్ హీరోగా రానున్న బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై చిత్రంలో కూడా ఇలాంటి సపోర్టింగ్ క్యారెక్టర్‌లోనే నటించారు కూడా.

అయితే ఆయన తన పాతరోజుల్ని గుర్తు చేసే రీతిలో మరోసారి పూర్తిస్థాయి విలన్‌గా నటించనున్నారని సమాచారం. మోహన్‌బాబు విలన్‌గా చేయనున్న ఈ చిత్రంలో బాలకృష్ణను హీరోగా నటింపజేయాలని దర్శకుడు భావిస్తున్నారట.

ఒకవేల బాలకృష్ణ కాదంటే జూనియర్ ఎన్టీఆర్‌తో ఈ చిత్రాన్ని నిర్మించాలని కూడా సదరు డైరెక్టర్ అనుకుంటున్నారని సమాచారం. మరి అన్ని రకాల పాత్రల్లో అద్భుతంగా రాణించిన మోహన్‌బాబు చాలా ఏళ్ల తర్వాత తన విలనిజంతో ఎలా మెప్పిస్తారో వేచి చూడాల్సిందే.
About Writer
Munibabu