అభిమానుల సేవకు సిద్ధం: యువరత్న
అభిమానులు ఆదేశిస్తే ఎలాంటి సేవకైనా సిద్ధమేనని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. ఆదివారం చేసిన ఈ వ్యాఖ్యలు బాలకృష్ణ రాజకీయ రంగ ప్రవేశానికి సంకేతాలుగా తెలుగుదేశం పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి రాజకీయ పార్టీ స్థాపిస్తే, ఆ పోటీని ఎదుర్కొనేందుకు తెలుగుదేశం పార్టీ కసరత్తులు చేపట్టిన విషయం తెల్సిందే. ఇందులోభాగంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నందమూరి కుటుంబానికి చెందిన సినీ హీరోలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఇదిలావుండగా బాలకృష్ణ తాజాగా నటించిన 'పాండురంగడు' చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనే ముందు మచిలీపట్నం సమీపంలోని జి.కొండూరు గ్రామంలో ప్రతిష్టించిన ఆయన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ అభిమానులనుద్దేశించి ప్రసంగించారు.
స్వర్గీయ ఎన్టీఆర్‌ను తనకు జన్మనిచ్చిన తండ్రిగానే కాకుండా.. నటన నేర్పిన గురువుగా భావించి ఆరాధిస్తున్నట్టు చెప్పారు. అలాగే తాను బాల నటునిగా వెండితెరకు పరిచయమైనప్పటి నుంచి ఇప్పటి వరకు తమ ఆదరాభిమానాలతో ఆదరిస్తున్న అభిమానులకు ఎన్నటికీ రుణపడి ఉంటానని చెప్పారు. అలాగే.. వారికి సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు బాలకృష్ణ ప్రకటించారు.