పరుగు ఆడియోకు మంచి ఆదరణ: ఆదిత్య మ్యూజిక్స్
|
ఇటీవల విడుదలైన పరుగు ఆడియో విజయాన్ని పురస్కరించుకుని విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉమేష్ గుప్త మాట్లాడుతూ పరుగు చిత్రం పాటలు అల్లు అర్జున్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయన్నారు. ఈ చిత్రం ఆడియో లెజీ ఫెలోస్‌కు సైతం క్రేజ్‌ను కల్గిస్తున్నాయని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో పాటల రచయిత అనంత్ శ్రీరామ్ స్పందిస్తూ పరుగు చిత్రంలో తాను మూడు పాటలు రాశానని, 10 ఏళ్ల తర్వాత కూడా గొప్పగా చెప్పుకునే విధంగా ఈ పాటలుంటాయని అన్నారు.
ఈ చిత్రాన్ని నిర్మించిన సహా నిర్మాత శిరీష్ మాట్లాడుతూ ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని మేడే రోజున పరుగు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేనున్నామని తెలిపారు.
ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే ఘన విజయం సాధించాయని, అదే తరహాలో చిత్రం కూడా అద్భుత విజయాన్ని సాధిస్తుందన్న విషయంలో తమకు పూర్తి విశ్వాసం ఉందని ఆయన అన్నారు.