గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » 'హ్యాపీడేస్' ఫేమ్ వరుణ్‌తో 'ఏవీఎం' 172వ చిత్రానికి శ్రీకారం
కథనాలు
Feedback Print Bookmark and Share
 
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ఏవీఎం తెలుగులో చాలాకాలం తర్వాత ఓ చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ చిత్రంలో 'హ్యాహీడేస్' ఫేం వరుణ్‌సందేశ్ హీరోగా నటించనున్నాడు. ఈ చిత్రం ఏవీఎం సంస్థకు 172వ చిత్రం కావడం విశేషం.

రామానాయుడు స్టూడియోస్‌లో నిరాడంబరంగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ చిత్రంలో 'అబద్ధం' చిత్రం ద్వారా తెలగుతెరకు పరిచయమైన విమలా రామన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మార్తాండ్ కె. శంకర్ దర్శకునిగా పరిచయమౌతున్నారు.

ఈ చిత్ర విశేషాల గురించి మార్తాండ్ కె. శంకర్ మాట్లాడుతూ ఏవీఎం లాంటి ప్రముఖ సంస్థ ద్వారా దర్శకునిగా పరిచయం కావడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రస్తుతం తాను దర్శకత్వం వహించబోయే ఈ చిత్రం కుటుంబకథతో కూడిన ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని తెలిపారు. జూన్ నెలలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని ఆయన చెప్పారు.

హీరో వరుణ్ మాట్లాడుతూ హ్యాపీడేస్ తర్వాత తాను నటిస్తోన్న 'కొత్త బంగారులోకం' చిత్రం షూటింగ్ జరుపుకుంటోందని, ఏవీఎం నిర్మిస్తోన్న ఈ చిత్రం తనకు మూడోదని అన్నారు. హీరోయిన్ విమల మట్లాడుతూ తాను తమిళం, మలయాళంలో కలిపి పది చిత్రాల్లో నటించానని తెలుగులో తొలిసారిగా నటించడం ఆనందంగా ఉందని అన్నారు.

నిర్మాత ఎం. శరవణన్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తెలుగులో మరిన్ని చిత్రాలు నిర్మించనున్నామని తెలిపారు. ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో బ్రహ్మానందం, గిరిబాబు, అలీ, రమాప్రభ, రాధాకుమారి, మాస్టర్ వెంకటేశ్ నటించనున్నారు.

ఈ చిత్రానికి మాటలు- రాజసింహ, పాటలు- బాస్కరభట్ల, సంగీతం- మణిశర్మ, నిర్మాతలు- ఎం.శరవణన్, ఎం.ఎస్.గుహన్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం- మార్తాండ్ కె. శంకర్.