ప్రధాన పేజి > వినోదం > వెండితెర > కథనాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సిక్స్ ప్యాక్ బాడీతో సిద్ధమైన సూర్య
Surya
WD PhotoWD
సినిమాలో అంగాంగ ప్రదర్శన అంటే అది హీరోయిన్లకు మాత్రమే ప్రత్యేకం అనే రోజులు పోయి హీరో సైతం అంగాంగ ప్రదర్శనకు సిద్ధమౌతున్నారు. అయితే హీరోయిన్లు తమ అందచందాలను ప్రదర్శిస్తే హీరోలు మాత్రం తాము పెంచిన కండల్ని తెరపై ప్రదర్శిస్తున్నారు.

బాలీవుడ్‌లో ప్రారంభమైన ఈ ట్రెండ్ ఇప్పుడు అన్ని భాషల చిత్రాలకి పాకింది. కొన్నాళ్ల క్రితం బాలీవుడ్‌లో కండల ప్రదర్శన అంటే సల్మాన్‌ఖాన్ గుర్తుకొచ్చేవాడు. అయితే తర్వాతి రోజుల్లో బాలీవుడ్ యువ హీరోలంతా ఈ రకమైన కండల ప్రదర్శనకు సిద్థమైనారు. దీంతో కేవలం కండల ప్రదర్శన కాకుండా మరోరకంగా తమ గొప్పతనన్ని ప్రదర్శించడానికి హీరోలు ప్రయత్నాలు ప్రారంభించారు.

ఆ వరసలో వచ్చిందే సిక్స్ ప్యాక్ బాడీ... చదునుగా ఉన్న పొట్టపై ఆరు మడతల్లో కండలు కనబడేలా తయారవడం ఈ సిక్స్ ప్యాక్ బాడీ ప్రత్యేకత. ఈ రకమైన సిక్స్ ప్యాక్ బాడీని ఓం శాంతి ఓం అనే హిందీ చిత్రంలో తొలిసారిగా హీరో షారుక్‌ఖాన్ ప్రదర్శించారు. అలా ప్రారంభమైన ఈ ట్రెండ్ మన తెలుగు చిత్రసీమను తాకింది.

దేశముదురు చిత్రంలో హీరో అల్లు అర్జున్ ఈ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించి మురిపించారు. తాజాగా విక్టరీ చిత్రం కోసం హీరో నితిన్ సైతం ఇదే తరహా సిక్స్ ప్యాక్ బాడీతో సిద్ధమయ్యారు. ఇలా హిందీ, తెలుగు చిత్రాల్లో మొదలైన సిక్స్ ప్యాక్ బాడీ ట్రెండ్ ఇప్పుడు తమిళ చిత్రసీమకు చేరింది.

తమిళంలో వారణమ్ ఆయిరమ్ అనే చిత్రం కోసం హీరో సూర్య ఈ రకమైన సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నారట. ఈ విషయమై సూర్య మాట్లాడుతూ సిక్స్ ప్యాక్ బాడీ కోసం తాను ఎనిమిది నెలలుగా ప్రత్యేకమైన శిక్షణ తీసుకుంటున్నానని తెలిపారు. కథపరంగా ఇలాంటి శరీరాకృతి అవసరమని భావించడంతో తాను ఎంతో శ్రద్ధ తీసుకుని మరీ సిక్స్ ప్యాక్ బాడీని పొందానని ఆయన చెప్పారు.

పాత్రకు న్యాయం చేయడం కోసం ఈ మాత్రం కష్టపడక తప్పదని కూడా ఆయన చెప్పారు. నిజమే ప్రతి సినిమాకు ఏదో ఒక వైవిధ్యం ప్రదర్శించాలనుకునే నేటితరం హీరోలు రానున్న రోజుల్లో సినిమా హిట్ కోసం ఎలాంటి రిస్క్‌లు తీసుకోనున్నారో వేచిచూడాలి మరి.
మరిన్ని
ఆ సినిమా చూసి ఏడ్చేశాను: ఇలియానా
చలనచిత్ర చరిత్రలో మరో అద్భుతం: దశావతారం
బాలీవుడ్ భామ శ్రీదేవికి సుప్రీం నోటీసు
మారిషస్ బ్యాక్‌డ్రాప్‌లో శివాజీ కొత్త చిత్రం
సస్పెన్స్ థ్రిల్లర్‌గా 'ఇదీ... అసలు కథ' టాకీ పూర్తి
చివరివరకు దర్శకునిగా ఉండాలన్నదే కోరిక: దాసరి