ఆదిత్య మ్యూజిక్స్ ద్వారా ''విక్టరీ'' ఆడియో
|
సోమవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు ఈ చిత్రం ఆడియో క్యాసెట్‌ను ఆవిష్కరించి మరో నిర్మాత ఎం.ఎస్.రాజుకు అందించారు. ఈ సందర్భంగా హీరో నితిన్ మాట్లాడుతూ కోచ్‌లు సంపత్‌రెడ్డి, వెంకట్‌ల పర్యవేక్షణలో తన దేహాన్ని 8ప్యాక్ బాడీగా తీర్చిదిద్దారని తెలిపారు.
చక్రి సంగీతాన్ని అందించిన తన గత చిత్రాలైన టక్కరి, ఆటాడిస్తా తరహాలోనే ఈ చిత్రం మ్యూజిక్ కూడా విజయాన్ని సాధిస్తుందని నితిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. నటునిగా తనలోని మెచ్యురిటీని దర్శకుడు రవి.సి.కుమార్ ఈ చిత్రంలో వెలికి తెచ్చారని నితిన్ పేర్కొన్నారు.
సంగీత దర్శకుడు చక్రి మాట్లాడుతూ నితిన్ ఎనర్జీ ఏమిటో విక్టరీ చిత్రంలోని మొదటిపాటలోనే తెలిసి పోతుందని అన్నారు. చంద్రబోస్, కలువకృష్ణసాయిలు చక్కని సాహిత్యాన్ని అందించారని తెలిపారు. క్వాలిటీ కోసం ఆలస్యమైనా తన చేత మంచి ట్యూన్స్ కట్టించిన దర్శకునికి తాను కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు.
నిర్మాత సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ నితిన్‌తో తమ సంస్థ ఏడాదికో చిత్రం నిర్మిస్తుందన్నారు. ఈ చిత్రానికి చక్రి సంగీతం హైలెట్‌గా నిలుస్తుందన్నారు. ఈ నెలాఖరుకు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తామని ఆయన వివరించారు.