ప్రధాన పేజి > వినోదం > వెండితెర > కథనాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కండోమ్ పాట పెడితే 'ఏ' సర్టిఫికేటా... ? నిర్మాత ఆవేదన
Somberi
WD PhotoWD
తమ చిత్రంలో కండోమ్ పాట పెట్టినందుకు ఏ సర్టిఫికేట్ ఇస్తారా అంటూ ఓ చిత్ర నిర్మాత సెన్సార్ తీరుపై ద్వజమెత్తారు. కోట్లు వెచ్చించి ప్రభుత్వమే బస్సుల్లోను, టీవీల్లోను కండోమ్ గురించి ప్రచారం చేస్తున్న తరుణంలో తమ చిత్రంలో కండోమ్ పాట పెట్టినందుకు అభినందించాల్సింది పోయి ఏ సర్టిఫికేట్ ఇస్తారా అంటూ ఆ నిర్మాత(లు) ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంతకీ సంగతేంటంటే... అలీ హీరోగా జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, యర్రమిల్లి వెంకట్రావు నిర్మాతలుగా సోంబేరి అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాన్ని ముగించుకుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు.

మా చిత్రానికి ఎందుకు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు అన్న నిర్మాతల ప్రశ్నకు... మీ చిత్రంలోని ఓ పాటలో కండోమ్ అనే పదం వాడబడింది. పాటలో కండోమ్ ఉంది కాబట్టి మీ చిత్రానికి ఏ సర్టిఫికేట్ ఇచ్చాం అని సెన్సార్ సభ్యులు వివరించారట. దీంతో ఆ నిర్మాతలకు చిర్రెత్తుకొచ్చింది.

కత్తులతో నరుక్కోవడం. రేప్‌లు, డబుల్ మీనింగ్ డైలాగులు ఉండే చిత్రాలకు యూ సర్టిఫికేట్లు ఇస్తూ... ఒల్లంతా కనిపించేలా చిన్ని చిన్ని బట్లలేసుకున్న ముముత్ లాంటి వారితో పాటలు చిత్రీకరించిన చిత్రాలకు ఓకే చెప్పే సెన్సార్ వాళ్లు మంచి చెప్పిన మా చిత్రానికి ఏ సర్టిఫికేట్ ఇస్తారా అంటూ వారు వాపోయారు.

ఈ సెన్సార్ వాళ్లకు సరైన నిబంధనలు లేవని ఇకనైనా వాళ్లు తమ నిబంధనల్ని సవరించాలని ఆ నిర్మాతలు పేర్కొన్నారు. అయితే అదే సెన్సార్ బోర్డులో సోంబేరి చిత్ర నిర్మాతల్లో ఒకరు సభ్యుడుగా ఉండడం విశేషం.

ఈ విషయంలో మరో విశేషం ఏంటంటే పైన మీరు చూస్తున్న కసెక్కించే ఫోటో ఈ సోంబేరి చిత్రంలోనిదే. ఇలాంటి దృశ్యాలు చూసి ప్రేక్షకులు చెడిపోకుండా నిర్మాతలు కండోమ్ గురించి కూడా తమ చిత్రంలో గుర్తుచేశారు. ఇంత మంచి విషయం ఆ సెన్సార్ సభ్యులుకు ఆర్ధం కానట్టుంది పాపం.
మరిన్ని
పోలీసుల క్లీన్ చిట్: ఊపిరి పీల్చుకున్న మల్లిక
'తమషా చూద్దాం రండి' ఆడియో విడుదల
ఆదిత్య మ్యూజిక్స్ ద్వారా 'విక్టరీ' ఆడియో
పాటల చిత్రీకరణ జరుపుకుంటోన్న 'బ్లేడు బాబ్జీ'
'కంత్రి' సెన్సేషనల్ హిట్: అశ్వినీదత్
సిక్స్ ప్యాక్ బాడీ కోసం చాలా కష్టపడ్డా: నితిన్