1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

శ్రీహరి, సుమన్ అన్నదమ్ములుగా "సామ్రాజ్యం"

శ్రీహరి
WD PhotoWD
శ్రీహరి, సుమన్ అన్నదమ్ములుగా "సామ్రాజ్యం" రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం షూటింగ్ ఫిలింసీటిలో జరుగుతోంది. ఈ చిత్రానికి రెండు యూనిట్లు పనిచేస్తుండగా, అందులో ఒకటి పాటల చిత్రీకరణలో ఉండగా, మరో యూనిట్ సన్నివేశాల చిత్రీకరణలో నిమగ్నమైందని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా ఫిలింసిటీలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో శ్రీహరి మాట్లాడుతూ... ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న చిత్రమిదని, ఇటువంటి చిత్రాలు కమర్షియల్‌గా విజయవంతం అయ్యాయనేందుకు గత చిత్రాలే నిదర్శనమని, వీరుద్వైత్ చక్కని దర్శకత్వం చిత్రం రూపుదిద్దుకుంటుందని అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ... ఇప్పటి వరకు 60 శాతం పూర్తయిందని, ప్రస్తుతం నాలుగో షెడ్యూల్ జరుగుతోందని, జూలై 15వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుండగా, ఆగస్టులో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. "ఆరవప్రాణం" తర్వాత హిట్ సినిమా రాలేదని, అది ఈ చిత్రంతో తీరుతుందనే నమ్మకముందని దర్శకుడు చెప్పారు. సుమన్ మాట్లాడుతూ... శ్రీహరితో కలిసి నటించడం ఆనందంగా ఉందని, మొదటిసారిగా ఫ్యాక్షన్ చిత్రంలో నటిస్తున్నానని వెల్లడించారు.
About Writer
Selvi