ప్రధాన పేజి > వినోదం > వెండితెర > కథనాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా "కాల్‌సెంటర్"  Search similar articles
కాల్‌సెంటర్లో ప్రియాంక
WD PhotoWD
హ్యాపీడేస్ ఫేం వంశీకృష్ణ హీరోగా, ప్రియాంక హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం కాల్‌సెంటర్. శ్రీసాయి బాలాజీ ఆర్ట్స్ పతాకంరై "నా ఊపిరి", "చిన్నోడు" చిత్రాల దర్శకుడు కణ్మణి దర్శకత్వంలో కాట్రగడ్డ లోకేష్‌దత్, యార్లగడ్డ రత్నకుమార్ (యార్లీ)లు నిర్మిస్తున్న "కాల్‌సెంటర్" చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుందని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోందని చిత్రయూనిట్ వెల్లడించింది.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ... యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోందని, ఇటీవలే విడుదలైన చిత్ర ఆడియోకు మంచి స్పందన లభించిందని అన్నారు. సాయి కార్తీక్ ఆకట్టుకునే బాణీలు అందించారని, కణ్మణి తన దర్శకత్వ ప్రతిభతో చిత్రాన్ని చక్కగా మలిచారని తెలిపారు. యూత్‌ను లక్ష్యంగా పెట్టుకుని తీసిన చిత్రమైనప్పటికీ, అన్నివర్గాలను మెప్పిస్తుందని వెల్లడించారు.

దర్శకుడు కణ్మణి మాట్లాడుతూ... కాల్‌సెంటర్ ద్వారా చెప్పదలచుకున్న విషయాన్ని వినోదభరితంగా తీర్చిదిద్దామని, పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడ్డ యువత జీవితాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలేమిటి? వాళ్ళు మన సంస్కృతి సంప్రదాయాలకు ఇస్తున్న విలువలేమిటి? అనే అంశాలతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలు ఎంత గొప్పవో చూపించబోతున్నట్లు వెల్లడించారు. ఆలోచింపజేసే విధంగా ఈ చిత్రం ఉంటుందని కణ్మణి అన్నారు. ఇంకా ఈ చిత్రంలో విజయానంద్, కరుణ, సౌమ్య, మారుతీ కుమార్, బాలాజీ తదితరులు నటించారు.
మరిన్ని
శ్రీహరి, సుమన్ అన్నదమ్ములుగా "సామ్రాజ్యం"
కలెక్షన్ల వెల్లువలో "సోంబేరి"
ప్రేమతో చెప్పండి : నాగబాబు
దశావతారం విజయానందంలో కమల్
వెండితెరపై 'వీరప్పన్‌‌'కు జీవం
ప్రజాక్షేమం కోసం మెగాస్టార్ ప్రత్యేక పూజలు