ముఖ్యమంత్రి చేతుల మీదుగా రాజశేఖర్ చిత్రం
సినీ నటుడు రాజశేఖర్ నూతన చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా అత్యంత ఘనంగా హైదరాబాదులోని తాజ్ కృష్ణలో జరిగింది. వైఎస్ క్లాప్ కొట్టగా దర్శకరత్న దాసరి ఫస్ట్ షాట్‌కు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మాజీ మంత్రి ఎమ్ సత్యనారాయణ ముఖ్యమంత్రి పాత్రను పోషిస్తున్నారు. పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో డాక్టర్ రాజశేఖర్ నటిస్తున్నాడు. ఆయన జీవిత భాగస్వామి జీవిత ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు వహిస్తోంది.
ఈ సందర్భంగా ఎమ్మెస్సార్ మాట్లాడుతూ... తనను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నవారి కోరిక ఈ చిత్రంతో నెరవేరుతుందని అన్నారు. సీఎం పాత్రలో నటించే అవకాశం తనకు రావటం ఎంతో ఆనందంగా వుందన్నారు. దాసరి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి పాత్రకుగాను ఎమ్మెస్సార్‌ను ఒప్పించటంతోనే చిత్రం సగం విజయమైనట్టేనని అన్నారు.
నటుడు రాజశేఖర్ మాట్లాడుతూ... తన చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ రావటం తనకు చెప్పలేనంత ఆనందంగా వుందన్నారు. నిత్యం ఎంతో బిజీగా వుండే ఆయన తన కోరికను మన్నించి ఇలా పబ్లిక్ ఫంక్షన్‌కు హాజరవటం చెప్పలేని అనుభూతినిచ్చిందన్నారు. చిత్రంలోని కథానాయికలనందరినీ బయటవాళ్లనే ఎందుకు తీసుకున్నారు అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ... తనతో నటించవద్దని వాళ్లకెవరో చెప్పారట. అందువల్లనే వారు తనతో నటించటానికి భయపడుతున్నారని చెప్పారు.