1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

నవ్వే దమ్ముందా నీలో? అంటున్న వేణు!

నవ్వే దమ్ముందా నీలో  అంటున్న వేణు సిటీలైఫ్  పర్ఫెక్ట్ విజువల్స్ బేనర్‌
WD PhotoWD
నవ్వే దమ్ముందా నీలో? అనే ట్యాగ్‌లైన్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి "సిటీలైఫ్" సిద్ధమౌతోంది. పర్ఫెక్ట్ విజువల్స్ బేనర్‌పై శరవేగంతో తయారవుతున్న "సిటీలైఫ్" సినిమా రీ-రికార్డింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుందని చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి. హాస్యనటుడు వేణుమాధవ్ కీలక భూమిక పోషిస్తున్న ఈ చిత్రం.. భిన్న సంస్కృతులకు ప్రాతినిధ్యం వహించే ఆధునిక నగర జీవితానికి అద్దం పట్టే విధం ఉంటుంది.

ఆధునిక నగర జీవితం ఆధారంగా పుల్‌లెంగ్త్ హ్యూమర్‌తో ప్రేక్షకులను అలరించడానికి హైదరాబాద్ నవాబ్స్, అంగ్రేజ్, ఎఫ్.ఎం. హ్యాట్రిక్ సినిమాల ఫేమ్ ఆర్.కె. (మామ) హిందీ క్రేజీ టీం అజీజ్, శివ, తబర్ గుల్లూభాయ్ సిద్ధమౌతున్నారు. అంతర్జాతీయ మాఫియాకి ప్రతినిధిగా నగరాన్ని హడలెత్తిస్తున్న పాతబస్తీ "మామ"ను నలుగురు యువకులు "పబ్‌థెరపీ" అనే సరికొత్త టెక్నిక్‌తో ఎలా ఎదుర్కొన్నారనే కథాంశంతో, హాస్యభరితంగా సాగుతుందని చిత్ర కథా రచయిత, నిర్మాత పి. వెంకటేశ్వర రావు తెలిపారు.

ఇంకా ఈ చిత్రంలో కౌటిల్య, సోను, తడివేలు, చంద్రశేఖర్ అజాద్, సత్యం యాబి, రూపాకౌర్ తదితరులు నటిస్తున్నారు. ఈ నెలలోనే ఆడియో విడుదలకాబోతున్న ఈ చిత్రానికి సంగీతం.. ప్రతాప్ విద్యాసాగర్, కెమెరా... ఆర్.వి.ఎన్. కోటి, ఎడిటింగ్.. వెంకట్, ఎగ్టిక్యూటివ్ నిర్మాత.. బి. వేణుగోపాలరావు. కథ, స్క్రీన్‌ప్లే, పాటలు, నిర్మాత.. పి. వెంకటేశ్వరరావు, దర్శకత్వం.. సౌదా.
About Writer
Selvi