"సిటీలైఫ్" ఆడియో ఆవిష్కరణ
|
ప్రతాప్ విద్యాసాగర్ సమకూర్చిన బాణీలతో ఆడియో మార్కెట్లోకి విడుదలైంది. శనివారం ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూథియేటర్‌లో జరిగిన ఆడియో వేడుకలో ముఖ్య అతిథి రచయిత డా. పరుచూరి గోపాల కృష్ణ ఆడియో ఆవిష్కరించి దర్శకురాలు జయకు అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులంతా "సిటీలైఫ్" చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా పరుచూరి గోపాల కృష్ణ వ్యాఖ్యానిస్తూ.. తన సినిమా అనుభవంతో రాసిన స్క్రీన్‌ప్లే పుస్తకం ఎంతోమందికి మార్గదర్శకమైందని గుర్తు చేసుకుంటూ... అందులో చిత్ర దర్శకుడు సౌదా తన శిష్యుడేనన్నారు. త్వరలో "వ్యాఖ్యానకళ"పై కూడా తెలుగు యూనివర్శిటీ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుత సినిమాలు యూత్‌ను టార్గెట్ చేసుకునే తీస్తున్నారని, పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తో రూపొందే "సిటీలైఫ్" కూడా మంచి విజయాన్ని సాధించాలని కోరారు.
దర్శకురాలు జయ మాట్లాడుతూ.. "సిటీలైఫ్" విన్నప్పుడే ఇంప్రస్‌కు గురయ్యాయని, నిర్మాతలో రచయిత కూడా దాగి ఉన్నాడనీ, అందుకే పాటలు చక్కగా అమరాయనీ, ఇటువంటి సినిమాలు మరిన్ని తీయాలని ఆశించారు. రచయిత దర్శకుడైతే సినిమాకు ఎంతో ఉపయోగపడుతుందని, ఆర్.కె. ప్రధాన పాత్ర చేయడం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ అని దర్శకుడు చంద్ర సిద్ధార్థ పేర్కొన్నారు.
చిత్ర నిర్మాత పి. వేంకటేశ్వరరావు మాట్లాడుతూ... ప్రపంచీకరణ వల్ల మార్పుఅనేది చాపకింద నీరులా ప్రవేశిస్తుందని, అటువంటి మార్పు హైదరాబాద్ నగరానికి వస్తే అక్కడున్న యువత, గూండాలు ఏవిధంగా మార్పు చెందారన్నది వినోదాత్మకందా తెరకెక్కించామని తెలిపారు.
ఆర్.కె. మాట్లాడుతూ... కామెడీకి, హ్యూమర్‌కు వ్యత్యాసం ఈ చిత్రంలో చూపించడం జరిగిందని చెప్పారు. ఈ సినిమా సంగీతం తననెంతో ప్రభావితం చేసిందని, అదే తనను సంగీత దర్శకుడిగా మార్చిందని ప్రతాప్ విద్యాసాగర్ అన్నారు. ఇంకా ఈ చిత్రంలో గొట్టెముక్కల పద్మారావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత వేణుగోపాల్, చిత్ర నటీ నటులు పాల్గొన్నారు.