శశాంక్, ఆర్యమీనన్ జోడీగా కొత్త చిత్రం
|
ఈ నెల 7 నుంచి హైదరాబాద్‌లో కీలకసన్నివేశాలను చిత్రించనున్నట్లు నిర్మాత చెబుతున్నారు. తనకు నచ్చిన చేతికళతో అనుకున్న గమ్యాన్ని ఎలా చేరాడు? అన్న పాయింట్‌తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుందని, చిత్రకారుడిగా శశాంక్ చక్కగా అమరాడని అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ... ప్రతిభ ఉంటేనే సరిపోదని, అందుకు తగిన ప్రోత్సాహం తోడైతే ఏదైనా సాధించవచ్చనే అంశానికి ప్రేమకథను జోడించి వినోదాత్మకంగా మలిచామని చెప్పారు. శశాంక్ మాట్లాడుతూ.. పల్లెనుంచి ఏ ఆధారం లేకపోయినా పట్నం వచ్చిన ఓ కుర్రాడు తనకు వచ్చిన చేతికళతో ఎలా అనుకున్నది సాధించాడనే పాయింట్‌తోనే కథ నడుస్తుందని వెల్లడించారు. హీరోగా మంచి గుర్తింపు వస్తుందని ఆకాంక్షించారు.
ఇంకా ఈ చిత్రంలో రంగనాథ్, గాయత్రి, ఎం.ఎస్. నారాయణ, అలీ, అన్నపూర్ణ, దువ్వాసి మోహన్, మేల్కొటి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం.. మోహన్ సితార.