1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

అభ్యంతకర పదాలను తక్షణమే తొలగిస్తాం!

అభ్యంతకర పదాలను తక్షణమే తొలగిస్తాం డాక్టర్ రాజశేఖర్ ఆర్తీ అగర్వాల్
WD
డాక్టర్ రాజశేఖర్, ఆర్తీ అగర్వాల్, మీరాజాస్మిన్ ప్రధాన పాత్రల్లో నటించిన "గోరింటాకు" చిత్రానికి చుక్కెదురైంది. ఈ నేపథ్యంలో, గోరింటాకు సినిమాలో అభ్యంతరకరమైన సన్నివేశాలు తొలగించే వరకు ఆందోళన కొనసాగిస్తామని వికలాంగుల హక్కుల పోరాట సమితి నేత మందకృష్ణ మాదిగ హెచ్చరించారు.

ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలను తక్షణం తొలగించాలంటూ మాసబ్ ట్యాంక్‌లోని సెన్సార్ బోర్డు కార్యాలయం వద్ద వికలాంగులు ఆందోళనకు దిగారు. దీనితో వికలాంగుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్న సన్నివేశాలను వెంటనే తొలగించాలని సెన్సార్ బోర్డు నిర్మాతకు హెచ్చరికలు జారీ చేసింది.

WD
మరోవైపు సున్నితమైన అంశాలను సెన్సార్ చేయడంలో ఉదాసీనంగా వ్యవహరించినందుకు బోర్డు తరపున క్షమాపణలు చెబుతున్నట్లు బోర్డు సభ్యురాలు శోభారాణి తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు

ఈ విషయమై గోరింటాకు చిత్ర దర్శకుడు వి.ఆర్. ప్రతాప్ స్పందిస్తూ... గోరింటాకులో చిత్రంలోని ఓ సన్నివేశంలో వచ్చిన కుంటి, గుడ్డి వంటి పదాలను వెంటనే తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఇంకా ఈ అంశంపై సూపర్ గుడ్ కార్యాలయంలో మాట్లాడుతూ... ఈ చిత్రంలో గారాబంగా పెరిగిన మీరాజాస్మిన్ వికలాంగురాలిగా నటిస్తూ, ఆకాష్‌న ఆటపటిస్తుందని, తను నిజంగానే వికలాంగురాలని తలచి ఆమెపై ఆకాష్ ప్రేమను వ్యక్తం చేస్తాడని అన్నారు.
WD
కానీ ఆమె తన అన్నయ్య ఇష్టపడితేనే తమ పెళ్ళి అవుతుందనే విషయాన్ని వెల్లడిస్తుంది. ఈ సందర్భంలో ఆకాష్.. నీకంటూ అభిప్రాయాలు లేవా? అన్నిటికి అన్నయ్యనే అంటావ్... మీ అన్నయ్య ఓ కుంటివాడినో, గుడ్డివాడినో పెళ్ళి చేసుకోమంటే చేసుకుంటావా? అని ప్రశ్నిస్తాడు... అందుకు మీరాజాస్మిన్ చేసుకుంటానని సమాధానమిస్తుంది. ఇదే సినిమాలోని సన్నివేశమని తెలిపారు.
WD
దీన్ని ఎవరో చెబితే వారు ఫీలయ్యారని, మీరు సినిమా చూడండని, గౌరవనీయులు కృష్ణమాదిగగారికి చెప్పానని ప్రతాప్ అన్నారు. ఈ సినిమా చూసిన కృష్ణమాదిగ బుధవారం తనకు ఫోన్‌చేసి, ఆ సినిమాలో వికలాంగుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్న కుంటి, గుడ్డి పదాలను తొలగించాలని అన్నారు.

WD
అయితే ఆ పదాలను తొలగిస్తే సాంకేతికపరంగా మరెన్నో ఇబ్బందులు తలెత్తుతాయని, మళ్ళీ దానికి సెన్సార్ జరగడం, సమయం వృధాకావడం జరుగుతుందని వివరించినట్లు తెలిపారు. ఇదంతా జరిగే పని కాదని భావించి కృష్ణమాదిగ కోరిక మేరకే వెంటనే ఆ డైలాగ్‌లను తొలగించివేస్తున్నామని, దీనివల్ల ప్రేక్షకుడు కొంత కన్‌ఫ్యూజ్‌కు గురైనప్పటికీ, దయచేసి అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్లు ప్రతాప్ వివరణ ఇచ్చారు.
About Writer
Selvi