శివకుమార్, జెనీలియా జంటగా "సత్య ఇన్ లవ్"
|
ఈ సందర్భంగా నిర్మాత శంకర్ మాట్లాడుతూ.. ఈ సినిమా ఆడియోను ఈ నెలాఖరులో విడుదల చేయబోతున్నామన్నారు. జెనీలియా అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని చెప్పారు. గురుకిరణ్ అందించిన బాణీలు ఆకట్టుకున్నాయని, యాక్షన్, లవ్, సెంటిమెంట్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేవిధంగా రూపొందింది.
తెలుగు నేటివిటీని కోల్పోకుండా దర్శకుడు జాగ్రత్తగా రూపొందించారని శంకర్ తెలిపారు. ఎం.ఎస్. నారాయణ, అజయ్ సుబ్బరాజు, నర్సింగ్ యాదవ్, సంతోష్ పవన్, శ్రీనాథ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా.. ఎం.ఆర్. శ్రీను., పాటలు... రామారావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం... రాఘవలోకి.