ప్రధాన పేజి > వినోదం > వెండితెర > కథనాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
బ్యాంకాక్ వెళ్లొచ్చిన "నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్"  Search similar articles
WD
శివాజీ, కావేరీ ఝా జంటగా కె.బి.సి సినిమా పతాకంపై ఎం. నాగేంద్ర కుమార్ దర్శకత్వంలో కుమార్ దర్శకత్వంలో కుమార్ బ్రదర్స్ నిర్మిస్తున్న చిత్రం "నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్". ఇటీవలే బ్యాంకాక్, పటాయ్ షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్ర విశేషాలను దర్శకుడు తెలియజేస్తూ... స్క్రీన్‌ప్లే ప్రధానాంశంగా తెరకెక్కుతోన్న సినిమా ఇదని, శివాజీ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని చెప్పారు. ఆసక్తికరమైన కథ, కథనాలతో రూపొందుతోన్న ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

నిర్మాత మాట్లాడుతూ.. జూన్ 15 నుంచి 20 రోజులపాటు బ్యాంకాక్‌లో హీరోహీరోయిన్లపై ఒక పాటను, ముఖ్య తారాగణంపై సన్నివేశాలను చిత్రించామని చెప్పారు. ఈ నెల 16 నుంచి హైదరాబాద్‌లో మరో షెడ్యూల్ ప్రారంభమవుతుందని, గోవాలో హీరోహీరోయిన్లపై చిత్రీకరించే మరో పాటతో షూటింగ్ పూర్తవుతుందని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం... మంత్ర, ఆనంద్, మాటలు... వేమగిరి, కెమెరా... పలమి, ఎడిటింగ్.. ఉపేంద్ర, ఎగ్జిక్యూటివ్ నిర్మాత.. పాండు.
మరిన్ని
మెలోడీ ఆఫ్ మాన్సూన్
13న "భరతముని" అవార్డుల ప్రదానం
సెల్యూలాయిడ్‌పై మరో "అంకుశం"
శివకుమార్, జెనీలియా జంటగా "సత్య ఇన్ లవ్"
ఏ పార్టీతో సంబంధం లేదు : మోహన్ బాబు
"లోకనాయకుడు"గా రాజశేఖర్!