1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"జంక్షన్‌"లో ప్రేమికులు

జంక్షన్ ప్రేమికులు
WD
లియో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పరుచూరి రవీంద్రనాథ్ కథానాయకుడిగా, నైనా కథానాయికగా పరిచయమవుతున్న చిత్రం జంక్షన్. "అసాధ్యుడు" ఫేం కె. అనిల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బి. రామకృష్ణ నిర్మిస్తున్నారు. మార్చి 8న షూటింగ్ ప్రారంభమై ఇప్పటివరకు నాలుగో షెడ్యూల్తో 90 శాతం షూటింగ్ పూర్తయింది.

నానక్‌రామ్‌గూడా సినీవిలేజ్‌లో హీరోహీరోయిన్లు, పావల శ్యామల, భానుచందర్ తదితరులపై కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. భానుచందర్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారని, ఈ చిత్రంలో హీరో స్వభావాన్ని మార్చే పాత్ర అతనిదని చెప్పుకొచ్చారు.

దేశస్వరూపమే జంక్షన్‌కు దగ్గరగా ఉంటుందని, ప్రతి మనిషి జంక్షన్‌లో రెడ్, గ్రీన్‌లైట్లను ఎదుర్కొనే ఉంటారు. అలా కొంతమంది ఆ జంక్షన్ వచ్చి కలుస్తుంటారు. అందులో ప్రేమికులు ఉంటారు. వీరి ప్రేమను అక్కడి వారు కలిపారా? ప్రతిబంధకాలుగా మారారా? అన్నది అంతర్లీనంగా ఉంటుదని వివరించారు.

రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయిందని, ఐదో షెడ్యూల్తో షూటింగ్ పూర్తవుతుందనీ, జాన్ సల్మాన్ సమకూర్చిన బాణీలు ఆకట్టుకుంటాయనీ, ఆగస్టు మొదటివారంలో ఆడియోను నెలాఖరులో సినిమాను విడుదల చేయనున్నామని దర్శకుడు చెప్పారు.

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. "ప్రేమఖైదీ", రౌడీ ఇన్స్‌స్పెక్టర్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన రవి ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్నాడు. హీరోగా తనకంటూ ఓ ముద్రవేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. టెర్రర్, భలేమిత్రుడు, డా.భవాని వంటి విజయవంతమైన చిత్రాల రచయితలైన పరుచూరి బ్రదర్స్ సినిమాలో నటించడం ఆనందంగా ఉందని భానుచందర్ తెలిపారు.

ఈ చిత్ర కథ తనకెంతో నచ్చిందని, కెరీర్‌కెంతో ఉపయోగపడుతుందని హీరోహీరోయిన్లు పేర్కొన్నారు. ఇంకా ఈ చిత్రంలో పావలా శ్యామల, జయప్రకాష్ రెడ్డి, అలీ, బ్రహ్మానందం, ఆశాశైని, బాబు మోహన్, ఉత్తజ్, డా. శివప్రసాద్ తదితరులు నటిస్తున్నారు.
About Writer
Selvi