కాంగ్రెస్ పార్టీకే తన ఓటు అని సూపర్‌స్టార్ కృష్ణ పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో, హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డిని సూపర్ స్టార్ కృష్ణ కలుసుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... వైఎస్సార్‌తో తనది దీర్ఘకాలిక మైత్రి అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తారా అనే మీడియా ప్రతినిధుల ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. తాను ముందు నుంచి కాంగ్రెస్ వాదినేనని, కాంగ్రెస్ పార్టీకి వెన్నంటి ఉంటానని చెప్పారు. ఇదిలా ఉండగా, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యానంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమగోదావరి, ఏలూరు నుంచి సూపర్ స్టార్ కృష్ణ లోక్‌సభకు ఎంపికైన విషయం తెలిసిందే.
|