1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

ఫిలింఫేర్ అవార్డులు : ఉత్తమ చిత్రంగా "హ్యాపీడేస్"

ఫిలింఫేర్ అవార్డులు : ఉత్తమ చిత్రంగా
WD
2007వ ఏడాదికి 55వ ఫిలిం‌ఫేర్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో శనివారం రాత్రి జరిగింది. ఈ అవార్డుల్లో భాగంగా "హ్యాపీడేస్" చిత్రానికి ఐదు కేటగిరీల్లో అవార్డులు దక్కాయి. ఉత్తమ సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్, ఉత్తమ సహాయ నటిగా సోనియా, గేయ రచయితగా వనమాలి, నేపథ్యగాయకుడిగా కార్తీక్‌లను ఈ అవార్డులు వరించాయి.

ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్ (యమదొంగ), నటి త్రిష (ఆడవారి మాటలకు అర్థాలు వేరులే), నూతన నటుడిగా రామ్‌చరణ్ తేజ (చిరుత), సహాయ నటుడిగా జగపతిబాబు (లక్ష్యం)కు దక్కాయి.

అలాగే మలయాళం, కన్నడ చిత్రాలుకూడా ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నాయి. ఇకపోతే నటీమణులు పూనం బజ్వా, రంభ, దివ్య, హస్నిక, శోభన, నమిత, శ్రియ, నటులు రాజా, వినీత్ తదితరులు ఆటపాటలతో కార్యక్రమానికి ఊపందించారు.

మరోవైపు తమిళ ఉత్తమ చిత్రంగా "పరుత్తివీరన్", ఉత్తమ నటుడు కార్తీక్ (పరుత్తివీరన్), నటి ప్రియామణి (పరుత్తివీరన్)‌లు ఎంపికయ్యారు. ఉత్తమ గుణ చిత్ర నటిగా సుజాత (పరుత్తివీరన్), ఛాయాగ్రహకుడిగా కెవి ఆనంద్ (శివాజీ), ఉత్తమ సంగీతం ఎ.ఆర్.రెహమాన్ (శివాజీ), కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిక్ (అళగియ తమిళ్ మగన్), గాయకుడు ఎస్.వి.బాలు సాదనా సర్గం (కిరీటం) అందుకున్నారు. సినిమా రంగంలో విశేష కృషి చేసిన శివకుమార్, జయప్రదకు జీవిత సాఫల్య అవార్డులు ప్రదానం చేశారు.

WD
బాధ్యత మరింత పెరిగింది : వనమాలి

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న "హ్యాపీడేస్" సినిమాలో అరెరె.. అరెరె... మనసే జారే.. అంటూ మనసైన పాట రాసిన వనమాలి ఉత్తమ పాటల రచయితగా 55వ ఫిల్మ్‌ఫేర్ అవార్డు (సౌత్)ను అందుకున్నారు. ఈ కార్యక్రమం కూడా ఇటీవలే చెన్నైలో జరిగింది. "హ్యాపీడేస్" చిత్రం మొత్తం ఆరు అవార్డులు సొంతం చేసుకుంది.

ఉత్తమ చిత్రంగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా మిక్కీస్ జె.మేయర్, ఉత్తమ దర్శకుడిగా శేఖర్ కమ్ముల, ఉత్తమ సహాయ నటిగా సోనియా, ఉత్తమ గాయకుడిగా కార్తీక్ (అరెరె..అరెరె)లు ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా వనమాలి తన స్పందనను తెలియజేస్తూ... పాట రాసే అవకాశం ఇచ్చిన శేఖర్ కమ్ములకు, మిక్కీస్‌లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అవార్డుతో తన బాధ్యత మరింత పెరిగిందని ఆమె చెప్పారు. పది సంవత్సరాల పాటు ఓ జర్నలిస్టుగా అవార్డులు, ప్రముఖుల స్పందనలను చవిచూసిన తాను, ప్రస్తుతం ఇలాంటి అనుభూతిని పంచుకోవడం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.
About Writer
Selvi