నవ్వే దమ్ముందా? అంటున్న "సిటీలైఫ్"
|
ప్రస్తుతం ఈ చిత్రం రీరికార్డింగ్ పూర్తిచేసుకుని డి.టి.ఎస్ మిక్సింగ్‌కు సిద్ధమైందని వెంకటేశ్వరరావు వెల్లడించారు. "సిటీలైఫ్" జీవితాలు ఎలా ఉంటాయో? చక్కని ఎంటర్‌టైన్‌మెంట్‌గా చూపించబోతున్నామని చెప్పుకొచ్చారు.
అన్ని కార్యక్రమాలు ముగించుకుని ఆగస్టు మొదటివారంలో "సిటీలైఫ్"ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇంకా ఈ సినిమాకు కెమెరా... ఆర్.వి.ఎన్. కోటీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత... బి. వేణుగోపాల రావు, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత... పి. వెంకటేశ్వరరావు, సంభాషణలు, దర్శకత్వం.. సౌదా.